బ‌దిరుడైన ఓన‌ర్‌ కోసం 'మియావ్‌' మాని, సైన్ భాష‌ నేర్చిన‌ పిల్లి! (వీడియో)

by Sumithra |
బ‌దిరుడైన ఓన‌ర్‌ కోసం మియావ్‌ మాని, సైన్ భాష‌ నేర్చిన‌ పిల్లి! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః పెంపుడు జంతువుల్లో కుక్క‌ల త‌ర్వాత పిల్లుల‌దే ఎక్కువ ప్రాధాన్య‌త‌. క్యూట్‌గా, స్వీట్ వాయిస్‌తో, మెత్త‌మెత్త‌గా ముచ్చ‌ట‌గొలిపే పిల్లులంటే కొంద‌రికి అమిత‌మైన ఇష్టం. ఎంతంటే,ఈ మ‌ధ్య ఓ మ‌హిళ ఇంటి ఓన‌ర్ పిల్ల‌ని పెంచుకోడానికి ఓప్పుకోవ‌ట్లేద‌ని ఏకంగా పిల్లిని పెళ్లే చేస్కుందంటే న‌మ్మండి! మ‌నుషుల భావాల్ని అర్థం చేసుకొని, య‌జ‌మానుల‌తో ఎంతో క్యూట్‌గా వ్య‌వ‌హ‌రించే ఈ పిల్లులు త‌మ‌కు ఏదైనా కావాల్సి వ‌స్తే మాత్రం 'మియావ్‌... మియావ్' అంటూ ఊపిరాడ‌నివ్వ‌కుండా కాళ్ల‌కు అడ్డుప‌డ‌తాయి. అయితే, ఈ వీడియోలో క‌నిపించే పిల్లి మాత్రం త‌న య‌జ‌మాని బ‌దిరుడు కావ‌డంతో మ్యావ్ భాష‌తో ప్ర‌యోజ‌నం లేద‌నుకుంది. ఆశ్చర్యకరంగా, ప్రత్యేకమైన సంకేత‌ భాష‌ను నేర్చుకుంది. య‌జ‌మాని తింటున్న‌ది త‌న‌కి కూడా పెట్ట‌మ‌ని అడ‌గ‌డానికి చేతుల‌తో సంకేతాలు పంపే ఈ వీడియో నమ్మశక్యం కాన‌ట్లు, ఎంతో క్యూట్‌గా ఉంటుంది! ఈ పిల్లి తెలివితేట‌ల‌కు నెటిజ‌నులు నివ్వెర‌పోయారు. రెడ్ఇట్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు మంచి స్పంద‌న వ‌స్తోంది.

Advertisement

Next Story

Most Viewed