- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమ్మర్ స్పెషల్ ‘ఐస్ యాపిల్’.. పెళ్లి రిసెప్షన్‌లో అతిథులకి తాటి ముంజలు
దిశ, డైనమిక్ బ్యూరో: సమ్మర్ సీజన్ కావడంతో ఓ పెళ్లి వేడుకల్లో వచ్చిన బంధువులు, సన్నిహితులను కూల్ చేసేందుకు పెళ్లి వారు వెరైటీగా ప్లాన్ చేశారు. ఎండాకాలం వచ్చే పెళ్లి వేడుకల్లో అతిథులకు ఎక్కువగా జూస్‌లు, ఐక్రీంలు ఇవ్వడం చూసి ఉంటారు. కానీ హైదరాబాద్ లోని ఒక రిసెప్షన్ లో అందుకు భిన్నంగా అందరూ ఇష్టంగా తినే పండ్లను ఏర్పాటు చేశారు. అతిథుల కోసం ఏకంగా తాటి ముంజలు ఏర్పాటు చేశారు. దీంతో అతిథులు తాటి ముంజలని ఇష్టంగా తిన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దొరికే తాటి ముంజలు హైదరాబాద్ ఫంక్షన్లలో ప్రత్యక్షమవడంతో అతిథులు ఆశ్చర్యంతో ఆరగించారు. మన్నెగూడలోని బీఎంఆర్ శ్రద్ధ కన్వెన్షన్‌లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ తాటి ముంజలను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు సైతం వారి ఆతిథ్యాన్ని చూసి ఫిదా అయిపోయారు.
కాగా, వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి తాటి ముంజలు. ఇవి తాటి చెట్ల కాయల నుంచి లభిస్తాయని అందరికీ తెలిసిందే. ఈ తాటి ముంజలు శారీరానికి కలిగించే చలువ వల్ల ‘ఐస్ యాపిల్’ అని కూడా అంటారు. ఈ ఐస్ యాపిల్స్‌లో ఏ, బీ, సీ వంటి విటమిన్లు, జింక్, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం మొదలైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. వేసవి వేడి నుంచి శరీరాన్ని తాటి ముంజలు చల్లబరుస్తాయి. అందుకే అందరూ ఇష్టంగా తింటారు.