- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలా కూడా అన్‌బాక్స్ చేస్తారా..?! నెట్టింట్లో నవ్వులు, లైకులు
దిశ, వెబ్‌డెస్క్ః కొత్తగా ఏ ప్రొడక్ట్ కొన్నా దాన్ని ఎలా వినియోగించాలో తెలుసుకోవాలంటే నేరుగా యూట్యూబ్‌కి వెళ్తే సరిపోతుంది. అక్కడ మనకు కావాల్సిన అన్బాక్సింగ్, సమీక్షల వీడియోలు మనకు అన్నింటినీ నేర్పిస్తాయి. ఇక, ఇలాంటి వీడియోలు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి కూడా. అయితే, ఈ కుర్రోడు మాత్రం చిలిపిగా ఆలోచించాడు. విమల్ పాన్ మసాలా సాచెట్‌ను ఎలా అన్‌బాక్స్ చేయాలో నేర్పించాడు. ఈ పేరడీ వీడియో పాతదే అయినా సరికొత్తగా అందరికీ నవ్వులు పంచుతుంది. యూట్యూబర్ మృత్యుంజయ్ శర్మ అనే టీనేజ్ బాయ్ విమల్ పాన్ మసాలా ప్యాకెట్‌ను ఓపెన్ చేసి, మసాలా కలిపి, తినే పద్ధతిని చమత్కారంగా చూపిస్తాడు. ఎప్పుడో వచ్చిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, "ఈ వీడియోలో మేము మీకు చూపించినది పూర్తిగా వినోదం కోసం మాత్రమే. మేము ఎలాంటి చట్టవిరుద్ధమైన ఉత్పత్తులను లేదా ఏవైనా నిషిద్ధ విషయాలను ప్రచారం చేయడం లేదు. ఈ వీడియోలో చూపిన ఏదైనా ఉత్పత్తులను వినియోగించవద్దు" అనే హెచ్చిరికలు కూడా ఉండటం విశేషం.