Viral Video:షాకింగ్ వీడియో..గుడ్డు నుంచి కింగ్ కోబ్రా బయటకు రావడం ఎప్పుడైనా చూశారా?

by Jakkula Mamatha |
Viral Video:షాకింగ్ వీడియో..గుడ్డు నుంచి కింగ్ కోబ్రా బయటకు రావడం ఎప్పుడైనా చూశారా?
X

దిశ,వెబ్‌డెస్క్:ఇటీవల సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. పాము అంటే అందరికీ చాలా భయం ఉంటుంది. అయితే పాములు బయటకు వచ్చినప్పుడు మాత్రమే మనం చూడగలుగుతాం. గ్రామాలలో ఇంటి వద్ద ఆవులు, గేదెలు పెంచుకుంటారు. అలాగే కోళ్లు కూడా ఉంటాయి. ఈ క్రమంలో ఆవులు, గేదెలు పుట్టెటప్పుడు చూస్తుంటాం. అలాగే కోడి గుడ్లు పెట్టి పిల్లలకు జన్మనిస్తుంది. ఇవి కూడా మనం చూసే ఉంటాం. అయితే పాము పిల్లలు బయటకు రావడం చూసి ఉండరు. నాగుపాము పిల్ల గుడ్డును పగలగొట్టుకుని బయటకు వస్తున్న ఓ అద్భుతమైన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు విషయంలోకి వెళితే..తాజాగా ఇన్స్ స్టా గ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి తన చేతిలో కింగ్ కోబ్రా గుడ్డును పట్టుకుని ఉన్నాడు. ఆ గుడ్డు లోపలి నుంచి ఓ చిన్న పాము పిల్ల మెల్లిగా బయటకు వస్తోంది. ఆ చిన్న నాగుపాము గుడ్డు నుంచి బయటకు వస్తూ తన నాలుకను వేగంగా కదుపుతోంది. అప్పుడు బయటకు వస్తున్న ఆ చిన్న పాము శరీరం వణుకుతోందంట. ఈ నాగుపాము 18 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. దీని విషం అత్యంత ప్రమాదకరమైనది. ఈ కింగ్ కోబ్రాలు ఏనుగును కూడా చంపగలవు. ఈ వీడియోను @AMAZlNGNATURE అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed