- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఫుల్ టైం డాటర్ జాబ్’.. తల్లిదండ్రుల వద్ద ఉండేందుకు జీతం తీసుకుంటున్న కన్న కూతురు
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో చాలా మంది యువతియువకులు చదువులు, ఉద్యోగాల పేరిట తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. వారు పని చేసే దగ్గర ఒత్తిడిని ఎదుర్కోలేక మనస్థాపానికి గురవుతుంటారు. అయితే.. తమ కూతురు వేరే దగ్గర వర్క్ చేస్తూ ఒత్తిడికి గురవుతుందని తల్లిదండ్రులు బాధపడ్డారు. తమ బిడ్డని ఉద్యోగం మానేసి తమ వద్దే ఉండమని కోరారు. దానికి కూతురు నేను మీ వద్ద ఉంటా కానీ.. అందుకు నాకు జీతం కావాలని అడిగింది. కూతురు పెట్టిన కండిషన్‌కు ఆ తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసుకుందాం..
చైనాలోని నియానాన్ (40) అనే మహిళ.. పెళ్లి చేసుకోకుండా తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఉద్యోగం చేసుకునేది. 2022లో ఆమెకు ప్రమోషన్ సైతం దక్కింది. దీంతో పని ఒత్తిడి పెరిగింది. అయితే బిడ్డ బాధని చూడలేని తల్లిదండ్రులు ‘‘నువ్వెందుకు నీ ఉద్యోగం వదిలేయకూడదు. నీ ఆర్థిక అవసరాలను మేం తీరుస్తాం’’ అంటూ అడిగారు. దానికి ఓ కండిషన్ పెట్టింది కూతురు. తల్లిదండ్రులకు నెలనెల వచ్చే పెన్షన్ డబ్బులు 10 వేల యువాన్‌ల నుంచి.. నాలుగు వేల యువాన్‌లను జీతంగా ఆడిగింది.
దానికి వారు ఒప్పుకోవడంతో ఆమె చేస్తున్న ఉద్యోగం మానేసి తల్లిదండ్రులు వద్దనే ఉండి జీతం తీసుకుంటుంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా తానే ‘‘ఫుల్ టైం డాటర్ జాబ్’’ అంటూ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరు ‘‘ఇది ఉద్యోగం ఎలా అవుతుంది.. తల్లిదండ్రుల మీద ఆధారపడటం అవుతోంది. ఆమె చేసేది చాలా తప్పు’’ అంటూ విమర్శిస్తున్నారు.