Viral Video : సమోసాలో కప్పకాలు.. పచ్చి మిర్చిలా నంజుకు తినాలా ఏంటి..? (వీడియో)

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-09-17 12:22:55.0  )
Viral Video : సమోసాలో కప్పకాలు.. పచ్చి మిర్చిలా నంజుకు తినాలా ఏంటి..? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : హోటళ్లు, రెస్టారెంట్ లు, కేఫ్ లలో కల్తీ, కలుషిత, నాసిరకం ఆహార పదార్ధాలు, తినుబండరాల ఘటనలు కోకొల్లలుగా వెలుగు చూస్తున్నా జనం మాత్రం అలాంటి ఫుడ్ పట్ల ఆసక్తి మానుకోవడం లేదు. బయట కొనుగోలు చేసి తినే ఆహార పదార్ధాల్లో తరుచు బొద్దింకలు, బల్లులు వంటివి ప్రత్యక్షమవ్వడం చూస్తునే ఉన్నాం. ఇలాంటి ఘటన ఒకటి ఉత్తర ప్రదేశ్ గాజియబాద్‌లో చోటుచేసుకుంది హోటల్‌లో ఇష్టంగా సమోసా తింటున్న ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. తాను ఎంతో ఇష్టపడి ఆర్డర్ చేసి తింటున్న సమోసాలో కప్ప కాలు కనిపించడంతో ఆ వ్యక్తి అవాక్కయ్యాడు. తాను తింటున్న సమోసాలో కప్పకాలును గమనించిన బాధితుడు ఇందుకు కారణమైన హోటల్ నిర్వాహాకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవకు దిగాడు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సమోస సహా హోటల్‌లోని ఆహార పదార్థాల శాంపిల్స్‌ను పరీక్షలకు పంపించారు. కాగా, ఆహార పదార్థాల తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు.

Advertisement

Next Story