ఇలా ఉన్నారేంట్రా.. జెన్ జెడ్ కిడ్స్! యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ చూసి షాకైన తండ్రి

by Ramesh N |
ఇలా ఉన్నారేంట్రా.. జెన్ జెడ్ కిడ్స్! యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ చూసి షాకైన తండ్రి
X

దిశ, డైనమిక్ బ్యూరో: జెన్ జెడ్ కిడ్స్ (Gen Z kid's) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అధునాతన స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్స్, ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా వినియోగించే ఇంటర్నెట్ యుగంలో జన్మించిన వారు. అయితే ఓ జెన్ జెడ్ కిడ్ చేసిన పనికి తండ్రి షాక్‌కు గురయ్యాడు. ఇందులో సంబంధించిన ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఫోటోలు ఉన్న ప్రకారం.. కొడుకు దగ్గర ఉన్న ఐప్యాడ్‌లో (YouTube) యూట్యూబ్ సెర్చ్ హిస్టరీని తండ్రి చెక్ చేశాడు. అందులో గస్తీ కాయడం ఎలా, తండ్రితో ఫైట్ ఎలా చేయాలి? గూగుల్‌లో సెర్చ్ చేసి ఉన్నట్లుగా తండ్రి గమనించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఇంటర్‌నెట్ ఆల్ ఆఫ్ ఫేమ్ అనే యూజర్ ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటోకు దాదాపు 4.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అదేవిధంగా 83 వేలకు పై లైక్స్ కూడా వచ్చాయి. ఫోటో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. జెన్ జెడ్ కిడ్స్ ఇలా ఉన్నారేంట్రా? అని నెటినజన్లు షాక్ అవుతున్నారు. కాగా, 1995 నుంచి 2012 మధ్య జన్మించిన పిల్లలను ‘జనరేషన్ జెడ్‌’(జెన్ జెడ్) అంటారు. జెన్‌ జెడ్‌ కేటగిరీకి చెందిన వారు ప్రపంచాన్ని భిన్నంగా చూస్తారని నిపుణులు చెబుతుంటారు.

Advertisement
Next Story