మహిళ పొత్తికడుపులో కత్తెర.. 12 సంవత్సరాల తర్వాత వెలుగులోకి అసలు నిజం

by Mahesh |
మహిళ పొత్తికడుపులో కత్తెర.. 12 సంవత్సరాల తర్వాత వెలుగులోకి అసలు నిజం
X

దిశ, వెబ్ డెస్క్: సరిగ్గా 12 సంవత్సరాల క్రితం డాక్టర్లు చేసిన నిర్వాకం ఇటీవల వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సిక్కింకు చెందిన ఓ మహిళ కడుపులో నొప్పి కారణంగా ఆసుపత్రికి వెళ్లింది. అయితే ఎన్నిసార్లు మందులు వాడినప్పటికీ ఆమె కడుపులో నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో అక్కడి డాక్టర్లు ఆమెను స్కానింగ్ తీసి చూడగా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ మహిళ పొత్తికడుపులో కత్తెర ఉన్నట్లు గమనించారు. అనంతరం ఆమెకు ఆపరేషన్ చేసి పొత్తి కడుపులో ఉన్న కత్తెరను బయటకు తీశారు. అయితే ఆమె కడుపులో కత్తెర ఎలా వచ్చిందని ఆరా తీయగా.. తాను 2012 సంవత్సరంలో అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ చేయించుకున్నానని.. ఆ తర్వాత కొద్ది రోజుల నుంచి ఇలా కడుపులో నొప్పి ప్రారంభం అయిందని మహిళ డాక్టర్లకు చెపింది. అంటే 12 సంవత్సరాల క్రితం ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో కత్తెర ను మర్చిపోయారు. దీంతో అప్పటి నుంచి ఆ మహిళ తన పొత్తికడుపులో కత్తెరను పెట్టుకొని తీవ్ర నొప్పితో బాధ పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు బయటకు పొక్కడంతో ప్రభుత్వ అధికారులు సదరు డాక్టర్ ను వివరణ కోరినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed