దాదాపు 100 సంవత్సరాల క్రితం నాటి క్యాడ్‌బరీ డైరీ మిల్క్

by Nagaya |   ( Updated:2023-03-05 15:40:06.0  )
దాదాపు 100 సంవత్సరాల క్రితం నాటి క్యాడ్‌బరీ డైరీ మిల్క్
X

దిశ, వెబ్‌డెస్క్: 100 ఏళ్ల నాటి క్యాడ్‌బెర్రీ డైరీ మిల్క్ బాక్స్ చూశారా..?

ప్రస్తుతం మార్కెట్‌లోకి రకరకాల చాక్లెట్లు, కలర్‌ఫుల్ రేపర్లు అందుబాటులోకి వచ్చాయి. కాని 100 ఏళ్ల క్రితం క్యాడ్‌బెర్రీ డైరీ మిల్క్ చాక్లెట్ బ్లాక్స్ ఎలా ఉందో తెలుసా..? తెలియకుంటే మీరు ఓ లుక్ వేయండి. పైన కనిపిస్తున్న ఈ క్యాడ్ బెర్రీ బాక్స్‌ని తన ఇంట్లోని ప్లోర్‌బోర్డ్ కింద గుర్తించినట్లు యూకేలోని ఓ మహిళ వెల్లడించింది. దాదాపు 1930 నాటికి చెందిన ఈ బాక్స్‌ని బౌర్న్‌విల్లే ఇంగ్లాండులోని గార్డెన్ విలేజ్‌లో తయారు చేసినట్లు తెలుస్తుంది. పర్పుల్ కలర్‌లో ఉన్న ఈ బాక్స్ వందేళ్లయినా తన సహజ రంగును కోల్పోలేదు. ఈ బాక్స్ ఖరీదు నాటి యూకే కరెన్సీ విలువ ప్రకారం 6 పెన్సులు(కాయిన్స్) కలిగి ఉంది.

Also Read..

చాక్లెట్‌ను ఎవరు కనిపెట్టారు... అప్పట్లో చాక్లెట్‌ను కవర్లో కాకుండా బంగారు పాత్రల్లోనే ఎందుకిచ్చేవారు?

Advertisement

Next Story