- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చపాతీలు ఈ విధంగా చేస్తున్నారా.. అయితే కాన్సర్ వచ్చినట్లే.?
దిశ, వెబ్‌డెస్క్: భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రసిద్ద చెందిన వంటకాల్లో చపాతి ఒకటి. ఊబకాయంతో బాధపడుతున్న వారు, లావు తగ్గాలని కోరుకుంటున్నా వారు రాత్రి సమయంలో అన్నం మానేసి చపాతీలు తినేందుకు ఇష్టపడుతున్నారు. ప్లేట్ నిండా భోజనం తినే కంటే ఒకటి, రెండు చపాతీలు తినడం మెరుగు అని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. ఈ మేరకు చాలా మంది చపాతీలు తినేందుకు ఎక్కువ ప్రాధాన్యం చూపిస్తున్నారు.
అయితే చపాతీలు ఈ విధంగా చేస్తున్నట్లయితే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు పరిశోధకులు. చపాతీలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. కొంత మంది తవాపై వండిన తర్వాత మళ్లి గ్యాస్‌పై కాల్చడం లాంటివి చేస్తారు. ఇలా అధిక ఉష్ణోగ్రతల వద్ద చపాతీ కాల్చడం వల్ల అనేక వ్యాధులు వస్తాయని చపాతీ తయారీకి సంబంధించిన ఓ పరిశోధనలో తేలింది.
ఈ రీసెర్చ్ ప్రకారం.. చపాతీలను అధిక ఉష్ణోగ్రతల వద్ద కాల్చినట్లయితే క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయట. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి ఆస్తమా రోగులు ఎక్కువ బాధపడతారు. అంతే కాకుండా.. ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త డాక్టర్ పాల్ బ్రెండ్ ప్రకారం: ‘‘గ్యాస్‌పై నేరుగా చపాతీ కాల్చడం కారణంగా అక్రిలమైడ్ అనే రసాయనవ ఉత్తత్పి అవుతుంది. దీంతో క్యాన్సర్ కారకాలు పెరిగి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందంటున్నారు.
న్యూట్రిషన్ అండ్ క్యాన్సర్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం..
గ్యాస్ నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి అనేక ప్రమాదకరమైన వాయువులు విడుదల చేస్తాయి. గ్యాస్‌పై ఏదైన డైరెక్ట్‌గా కాల్చినట్లుయితే.. ఆ గ్యాస్ నుంచి వెలువడే వాయువులు ఆరోగ్యానికి ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇది శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్, హృదయ సంబంధం రుగ్మతలకు కారణమవుతుందని చెప్పారు. అయితే ఈ పరిశోధన ఫలితాలు నిజమని చెప్పేందుకు ఆధారాలు లేనప్పటికీ.. రీసెర్చ్‌లో వస్తున్న విషయాలు మాత్రం ప్రజలను భయందోళనకు గురిచేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: వెన్ను నొప్పి వేధిస్తోందా?. కారణం ఇదే కావచ్చు!
ఇకపై ఇంగ్లీష్ మాట్లాడితే రూ. 82 లక్షల జరిమానా.. సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం..!