‘గుడ్డు’ పాలిటిక్స్! ఎలా తయారు చేయాలో నేర్పిస్తా రండి! బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |   ( Updated:2024-05-07 14:15:03.0  )
‘గుడ్డు’ పాలిటిక్స్! ఎలా తయారు చేయాలో నేర్పిస్తా రండి! బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల దగ్గరపడుతున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రధాని మోడీ తెలంగాణకు ఇచ్చింది ‘గాడిదగుడ్డు’ అని కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. పదేళ్లలో తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని చెబుతూ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా కాంగ్రెస్ పార్టీ వాడుతున్న ‘గాడిదగుడ్డు’ పాపులర్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఏ ప్రచారంలో భాగంగా సభలో ప్రసంగించిన గాడిద గుడ్డు ఫోటోను ప్రదర్శిస్తున్నారు. దీనిపై బీజేపీ శ్రేణులు తీవ్రస్థాయిలో కౌంటర్లు ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తాజాగా ఆసక్తికర ట్వీట్ చేశారు.

‘గుడ్లు ఎలా తయారు చేయాలో మీకు నేర్పిస్తాను రండి, ఇతను సామాన్యుడు కాదు, ఇందులోనే జీవిత తత్వం దాగి ఉంది’ అని బీజేపీ, కాంగ్రెస్ గుడ్డు వీడియోను పోస్ట్ చేశారు. లోటస్ పేరుతో ఉన్న బీజేపీ గుడ్డులో బీజేపీ అభివృద్ధి గురించి వివరించారు. ఆర్టికల్ 370 రద్దు, రామ మందిరం నిర్మాణం, వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీ భారత్ 5 ప్లేస్, ఫ్రీ రేషన్, డిజిటల్ ఇండియా, వంద శాతం విద్యుత్, అవినీతి లేని పాలన, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛా భారత్, జన్ ధన్ ఖాతాలు, దేశ భద్రత, ఆత్మ నిర్భర్ భారత్ అని అభివృద్ధిపై పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పేరుతో ఉన్న లూట్ అస్ అనే గుడ్డులో బోఫోర్స్ కుంభకోణం, నేషనల్ ఎమర్జెన్సీ, ముంబాయ్ బాంబ్ బ్లాస్ట్, కామన్‌వెల్త్ కుంభకోణం, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం, అవినీతి, బుజ్జగింపుల పాలిటిక్స్ లాంటివి కాంగ్రెస్ పాలనలో జరుగుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు.

Click Here For Twitter Post

Advertisement

Next Story