Wayanad landslides : హృదయ విదారకర ఘటన! బురదలో చిక్కుకున్న కోతి పిల్లలు

by Ramesh N |
Wayanad landslides : హృదయ విదారకర ఘటన! బురదలో చిక్కుకున్న కోతి పిల్లలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రకృతి సృష్టించే విధ్వంసానికి మనుషులతో పాటు అడవిలో జంతువులు సైతం ప్రమాదానికి గురి కావాల్సి వస్తుంది. మనుషులను కాపాడడానికి ప్రభుత్వాలు సహాయక చర్యలు అందిస్తాయి. మరి ఈ ఘటనల్లో జంతువులను కాపాడటానికి ఎవరు ముందుంటారు.. అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు కోతి పిల్లలు బురదలో వణుకుతూ.. భయం భయంగా ఒకదాన్ని ఒకటి పట్టుకుని కూర్చుని ఉన్నాయి. ఆ కోతిపిల్లలు ఆకలితో నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు వీడియోలో కన్పిస్తోంది. దీనిని గమనించిన వ్యక్తి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఇటీవల కేరళ రాష్ట్రం, వయనాడ్ లో జరిగిన విధ్వంసం తర్వాత.. ఒక కోతి తను కన్న కోతిపిల్లను కాపాడుతున్న విధానం.. అంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో చక్కర్లు కొడుతోంది. నిజంగా హృదయవిదారకం.. చాలా బాధగా ఉందని నెటిజన్లు వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, కేరళలోని వయనాడ్‌లోప్రకృతి విలయానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 400 వరకు ప్రాణాలు కోల్పోయారని, వందల మందికి గాయాలు, 200 మందికి పైగా ఆచూకీ తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed