- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Asaduddin Owaisi: మరికొద్ది గంటల్లోనే పోలింగ్ .. గల్లీలో కూల్‌గా క్రికెట్ ఆడుతున్న అసదుద్దీన్ (వీడియో వైరల్)
దిశ, వెబ్‌డెస్క్: హైదరా‘బాద్ షా’, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ గురించి రాష్ట్రంలో తెలియని వ్యక్తి అంటూ ఉండరు. ఓటమి ఎరుగని నేతగా ఓవైసీకి పేరుంది. అయితే, ఇన్నాళ్లు సునాయాసంగా గెలుపొందిన ఆయన ఈ సారి విజయం కోసం చెమటోడ్చాల్సి వస్తోంది. అసదుద్దీన్‌ను ఓడించి హైదరాబాద్ ఎంపీ స్థానంపై పాగా వేయాలని చూస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగానే హిందుత్వ భావాలు కలిగిన సరైన అభ్యర్థి మాధవీ లతను రంగంలోకి దిగింది. దీంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఈ తరుణంలో ఎన్నడూ లేని విధంగా అసదుద్దీన్ వినూత్న ప్రచారానికి తెర లేపారు. హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా గడగడపకు తిరుగుతూ.. తమకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. మరోవైపు మాధవీ లత.. పోరాడితే పోయేదేముంది అన్న రీతిలో ప్రతి ముస్లిం కుటుంబాలను కలుస్తూ బీజేపీకే ఓటు వేయాలని వేడుకున్నారు. ఈ క్రమంలోనే మరికొద్ది గంటల్లోనే పోలింగ్ ఉందనగా అసదుద్దీన్ సరదాగా చిల్ అవుతూ కనిపించారు. ఓ గల్లీలో పిల్లలు క్రికెట్ ఆడుతుండగా.. వారి వద్దకు వెళ్లి క్రికెట్ ఆడారు. అందుకు సంబంధించి వీడియో ఓ నెటిజన్ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన కొందరు అసలే బీజేపీతో టగ్ ఆఫ్ వార్ నడుస్తుంటే అసదుద్దీన్ క్రికెట్ ఆడుతున్నాడేంటని పరేషాన్ అవుతున్నారు.