- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామ్మో ఇదేం డాన్సురా నాయనా.. ఎక్స్ప్రెషన్ చూశారంటే భయపడి చావాల్సిందే..
దిశ, ఫీచర్స్ : నేటి యువత సోషల్ మీడియాకు అతిగా అడిక్ట్ అయిపోతున్నారు. వీధుల్లో, మార్కెట్లలో, మెట్రో రైళ్లలో ఇలా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాగే ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేస్తూ, వీడియోలు తీస్తున్నారు. తాజాగా అసోంలోని గౌహతిలో ఓ ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయి వేసుకున్న గెటప్‌ని చూసి రోడ్డు పై వెళ్లేవాళ్లు కూడా ఆమెను చూస్తూ ఉండిపోయారు.
వైరల్ అయిన ఈ వీడియోలో అమ్మాయి మార్గమధ్యంలో 'మంజులిక' లాగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. 'భూల్ భూలయ్యా' సినిమాలోని ఈ క్యారెక్టర్ గెటప్‌లో అమ్మాయిని చూసిన వారందరూ ఫిదా అయిపోయారు. ఆ అమ్మాయిని షిల్లాంగ్‌కు చెందిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రీతి థాపాగా గుర్తించారు. ఆమె తనను తాను మెగా మిస్ నార్త్ఈస్ట్ 2012గా ప్రకటించుకుంది. వీడియోలో ప్రీతి పచ్చని చీరలో చిందరవందరగా జుట్టుతో, ముఖానికి మేకప్‌తో రోడ్డు మధ్యలో వింతగా డ్యాన్స్ చేస్తోంది.
ఆమె తన ఇన్‌స్టా ఖాతా @preetithapasoss నుండి వీడియోను షేర్ చేసింది. దానికింద 'మంజులిక గౌహతిలో కనిపించింది' అని ట్యాగ్ చేసింది. 34 వేల మందికి పైగా పోస్ట్‌ను లైక్ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు ప్రీతీని కొందరు తీవ్రంగా విమర్శించగా, కొందరు వ్యక్తులు గుర్తింపు తెచ్చుకునేందుకు ఫన్నీ పనులు చేయడం మానుకోవడం లేదని అంటున్నారు.