viral: పాము నోట్లో తన నాలుక పెట్టిన యువకుడు.. చివరికి ఏం జరిగిందంటే? వీడియో వైరల్

by Hamsa |
viral: పాము నోట్లో తన నాలుక పెట్టిన యువకుడు.. చివరికి ఏం జరిగిందంటే? వీడియో వైరల్
X

దిశ, ఫీచర్స్: చాలా మంది పాములు అనగానే భయంతో వణికిపోతుంటారు. కొందరికైతే.. పాముల వీడియోలు, ఫొటోలు చూసినా భయంతో జ్వరం వచ్చేస్తుంది. అయితే పాములను దేవుడిగా కూడా ఎంతో మంది కొలుస్తూ.. పాలు కూడా పోస్తున్నారు. అలాగే మరికొందరు ఏకంగా పాములను తమ పెంపుడు జంతువులుగా మార్చుకుని ప్రేమ కురిపిస్తున్నారు. చిన్న పిల్లల కానుంచి పెద్దవారి దాకా పాములతో పలు వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

గత కొద్ది రోజుల నుంచి ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలెన్నో జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా, ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఓ యువకుడు బతికిన పామును పట్టుకుని అది నోరు తెరిస్తే దాని నోట్లో తన నాలుక పెట్టాడు. పాముని పట్టుకోవడం వరకు ఓకే కానీ ఈ యువకుడు ఒక్కసారి కాకుండా రెండు మూడు సార్లు నాలుక పాము నోట్లో పెడితే అది దూరంగా జరిగింది. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు.

(Video Link Credits to jejaksiaden Instagram Channel)

Advertisement

Next Story