వాన వాన వల్లప్ప తిరుగుదామిలా..వర్షంలో డ్యాన్స్ చేస్తూ, ఎంజాయ్ చేస్తున్న ఎలుక!

by Jakkula Samataha |   ( Updated:2024-06-07 08:49:27.0  )
వాన వాన వల్లప్ప తిరుగుదామిలా..వర్షంలో డ్యాన్స్ చేస్తూ, ఎంజాయ్ చేస్తున్న ఎలుక!
X

దిశ, ఫీచర్స్ : వాన వాన వల్లప్ప తిరుగుదామిలా.. నింగి నేల హరివిల్లై అనే సాంగ్ అందరికీ తెలిసిందే. ఇక వర్షం పడితే చాలు,ఈ సాంగ్స్ మనకు గుర్తుకు రావడమే కాకుండా, వర్షంలో తడుస్తూ ఈపాటులు పాడాలనిపిస్తుంటుంది. ఓ ఎలుకకు కూడా అలానే అనిపించిందేమో.. ఏంచక్కా వర్షంలో తడుస్తూ డ్యాన్స్ చేసింది. తొలకరి చినుకుల అనుభూతిని ఆస్వాధిస్తూ.. తాను చాలా ఎంజాయ్ చేసింది. నెమలి ఎలా అయితే నాట్యం చేస్తుందో, అలా ఎలుక వర్షంలో డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఇక అది ఏ మారుమూల ప్రాంతంలోనో, ఇంటిలో అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే, ఏకంగా హైవే రోడ్డు మధ్యలో దాని ఆనందాన్ని ప్రయాణికులతో పంచుకుంది. ఎలుక చిన్నపిల్ల మాదిరి రోడ్డుపై వర్షంలో తడిసింది. తర్వాత ఆనందంతో గంతులు వేస్తూ, డ్యాన్స్ చేసింది. ప్రస్తుం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక దీనిని చూస్తే చాలా రోజులుగా వర్షం కోసం ఎదురు చూస్తున్న ఎలుక, చిరుజల్లులు పడగానే వానలో ఎంజాయ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ వీడియోను @AMAZlNGNATURE పేరు గల X ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. దీనిపై ఒకొక్కరూ ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు క్యాబాత్ హై అని కామెంట్ చేస్తే మరికొందరు మొదటి సారి ఎలుక డ్యాన్స్ చూస్తున్నాను అంటూ చెప్పుకొస్తున్నారు.

అయితే మొన్నటి వరకు ఎండలు దంచికొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఉక్కపోత, వేడి తట్టుకోలేక ప్రజలే అల్లాడిపోయారు. మరి జంతువులు, పక్షలు, ఎలుకల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఒక్కసారి చిరు జల్లు కురవడంతో ఆ వేడి నుంచి ఉపశమనం పొందిన ఎలుక ఆ ఆనందంతో డ్యాన్స్ చేసినట్లు ఉంది అని కొందరు తెలుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈవీడియో చూపరులను తెగ ఆకట్టుకుంటుంది.

Advertisement

Next Story
null