- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదెక్కడి మాస్ రా మావ.. మురికి కాల్వలోనే లవర్‌తో రొమాన్స్!
దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కాలంలో ఫొటో షూట్‌ల సందడి ఎక్కువైంది. ఏ శుభ కార్యక్రమం జరిగినా స్పెషల్ ఫొటో షూట్ ఉండాల్సిందే. ఇక పెళ్లిల విషయానికి వస్తే ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, సాంగ్ షూటింగ్ అంటూ హంగామా చేస్తున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని జంటలు చేసే ఫొటో షూట్లు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటుంటే మరి కొన్ని ఆలోచింపచేసేవిగా ఉంటున్నాయి.
తాజాగా ఓ జంట ఫొటో షూట్ వైరల్ అవుతోంది. మిగతా వారి కంటే ఓ అడుగు ముందుకు వేసిన ఈ జంట ఏకంగా మురికి కాల్వలోనే ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ జంట ఎవరు? ఈ మురికి కాల్వ ఎక్కడిది అనే వివరాలు తెలియనప్పటికీ ఈ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ‘రేయ్.. ఎవర్రా మీరంతా’ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఫొటో షూట్ పేరుతో ఇవేం చేష్టలురా బాబు అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.