పెళ్లయిన 12 రోజులకు బయటపడ్డ వధువు నిజ స్వరూపం.. అదేంటో తెలిస్తే షాక్

by Disha Web Desk 20 |
పెళ్లయిన 12 రోజులకు బయటపడ్డ వధువు నిజ స్వరూపం.. అదేంటో తెలిస్తే షాక్
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్యకాలంలో చాలామంది మొదటి చూపులోనే ప్రేమలో పడడం, వివాహం చేసుకోవడం చూస్తున్నాం. అలాగే ఓ అబ్బాయి కూడా మొదటి చూపులోనే ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ తరువాత కొద్ది రోజులకే వివాహం కూడా చేసుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ వరుడికి ఉహించని షాక్ తగిలింది. ఈ సంఘటన ఇటీవల ఇండోనేషియా జరిగింది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి ఇంటర్నెట్‌లో యువతితో పరిచయం పెంచుకున్నాడు. కొన్ని రోజులు ఆన్‌లైన్‌లో డేటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత ఇద్దరూ వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్నెట్ లో పరిచయం అయిన అమ్మాయిని చూడగానే ఆ వ్యక్తి ప్రేమలో పడ్డాడట. ఆ తర్వాత పెళ్లికి ప్రపోజ్ కూడా చేశాడు. అయితే ఆ వ్యక్తి తనకు కాబోయే భార్య గురించి ఏమీ ఆలోచించకుండానే ప్రేమలో మునిగిపోయాడు. అందుకే ఆ నెట్ సుందరిని అనుమానించలేకపోయాడు.

అయితే ఆ నెట్ సుందరి తన పేరు అదిండా కంజ అజ్జహ్రా అని చెప్పింది. ఆమె తన ప్రియుడికి కలిసినప్పుడల్లా హిజాబ్‌లోనే ఉండేది. ఆ వ్యక్తి ఆమె శైలిని చాలా ఇష్టపడ్డాడు. అయితే పెళ్లి తర్వాత కూడా ఆమె ముఖం దాచుకోవడంతో కష్టాలు మొదలయ్యాయి. అంతేకాదు ఆ నెట్ సుందరి అందరిముందూ తడబడుతూ ఉండేది.

కొత్తగా పెళ్లయిన భార్య ప్రవర్తన చూసిన ఆ వ్యక్తి కలత చెందాడు. ఆ తర్వాత అతను విచారించగా అసలు నిజం తెలిసి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పటి వరకు భార్యగా భావించిన వ్యక్తి నిజానికి అమ్మాయిగా నటించి మోసం చేస్తున్న ఓ అబ్బాయి. దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నెట్ సుందరి పై కేసు నమోదు చేశారు. మోసం కేసులో అతనికి నాలుగేళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed