10 రోజులు వాటర్ బెడ్ రెస్ట్‌ తీసుకుంటే.. రూ.4.7 లక్షల జీతం

by Mahesh |   ( Updated:2025-03-16 09:46:40.0  )
10 రోజులు వాటర్ బెడ్ రెస్ట్‌ తీసుకుంటే.. రూ.4.7 లక్షల జీతం
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్ చేయకుండా 10 రోజులు వాటర్ బెడ్ పైనే పడుకునేందుకు రూ. 4.7 లక్షల జీతం ఇచ్చి.. జాబ్ ఇచ్చేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (European Space Agency) నిర్ణయం తీసుకుంది. అవును మీరు చదివింది నిజమే.. ఏ పని చేయకుండా బెడ్ పై 10 రోజులు పడుకొని రెస్ట్ తీసుకుంటే చాలు.. రూ. 4.7 లక్షల జీతం మీ సొంతం అవుతుంది. వివరాల్లోకి వెళితే. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ స్పేస్‌లో మానవ శరీరంపైన ఉండేటువంటి ప్రభావాలను అంచనా వేయడానికి ఫ్రాన్స్ ప్రయోగాలు చేస్తుంది. అయితే ఈ ప్రయోగాల కోసం వాలంటీర్లు కావాల్సి వచ్చింది. స్పేస్ ప్రయోగాలు కాబట్టి.. వేతనం ఎక్కువగా ఇచ్చేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ముందుకు వచ్చింది. 10 రోజుల పాటు.. వాటర్ బెడ్ పైన రెస్ట్ తీసుకున్న వాలంటీర్లకు రూ.4.7 లక్షలు చెల్లించేందుకు నిర్ణయించింది.

దీని కోసం ప్రత్యేకంగా వాటర్ ఫ్రూఫ్ ఫ్యాబ్రిక్‌ (Waterproof fabric) తో బాత్ టబులు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అదే సమయంలో... 10 రోజులు బెడ్ రెస్ట్ (Bed rest for 10 days) తీసుకుంటే వాలంటీర్లకు జీతం ఇవ్వనుంది. ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగం (experiment)లో 10 రోజుల పాటు వాటర్ బెడ్ పై రెస్ట్ తీసుకున్న తర్వాత వాలంటీర్ల బరువు, శరీర స్థితిగతులను అధ్యయనం చేస్తుంది. అంతరిక్ష వాతావరణం, ఇక్కడి వాతావరణ అంశాలలో తేడాలను గుర్తించేందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నారు. దీని కోసం 10 మంది పురుషులను వాలంటీర్లు2గా తీసుకుంటున్నారు. డ్రై-ఇమ్మర్షన్ (Dry-immersion) పరీక్షలతో పాటు 10 రోజుల హెడ్-డౌన్ బెడ్ రెస్ట్ ఫేజ్ ప్రయోగాన్ని వాలంటీర్లపై సైంటిస్టులు నిర్వహిస్తున్నారు. ఈ వాలంటీర్ల నియామకం గత సంవత్సరం ప్రారంభమైనట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏ పని చేయకుండా.. వాటర్ బెడ్ పై రెస్ట్ తీసుకుంటే రూ. 4.7 లక్షల జీతం ఇస్తారనేసరికి యువత ఈ జాబ్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు.

Read More..

హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో 95 శాతం సక్సెస్ రేట్.. అట్రాక్ట్ చేస్తున్న క్లినిక్స్

Next Story