నేటి నుంచే రైళ్ల ప్రయాణం

by Shamantha N |
నేటి నుంచే రైళ్ల ప్రయాణం
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సాధారణ ప్రయాణికులకు రైలు సర్వీసులు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. విమానాశ్రయాల్లో తీసుకునే జాగ్రత్తలన్నింటినీ ఇక్కడ చేపట్టినందున కనీసంగా గంటన్నర ముందే ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ పరీక్ష చేయనున్నారు. కరోనా లక్షణాలు లేకుంటే మాత్రమే వారిని రైళ్లలోకి పంపనున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, గర్భిణీలు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు రైళ్లలో ప్రయాణించకపోవడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి హౌరా, ధన్‌పూర్, గుంటూర్, నిజాముద్దీన్, హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ, ముంబాయి, వైజాగ్, తిరుపతి నుంచి నిజామాబాద్‌కు, నాందేడ్ నుంచి అమృత్‌సర్‌కు ఒక్కో రైలు ప్రయాణించనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed