- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IRCTC నుంచి స్పెషల్ ప్యాకేజీలో ‘గంగా రామాయణ్ యాత్ర’..
దిశ, వెబ్‌డెస్క్: ఈ సమ్మర్‌లో పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారికోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) తక్కువ ధరలో ఒక టూర్ ప్యాకేజీ ని తీసుకొచ్చింది. ‘గంగా రామాయణ్ యాత్ర(Ganga Ramayan Yatra)’ పేరుతో IRCTC ఈ ప్యాకేజీని అందిస్తుంది. దీనిలో భాగంగా నైమిశారణ్య, ప్రయాగ్రాజ్, సారనాథ్, వారణాసి పుణ్యక్షేత్రాలను చూడవచ్చు. 5 రాత్రులు, 6 రోజుల పాటు ఉండే ఈ టూర్ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నుంచి విమానంలో ప్రారంభమవుతుంది. ఈ యాత్ర మే 25న, తిరిగి జూన్ 7న అందుబాటులో ఉంటుంది.
యాత్ర పూర్తి వివరాలు:
* మొదటి రోజు హైదరాబాద్ నుంచి విమానంలో వారణాసికి చేరుకుంటారు. అక్కడ ముందే బుక్ చేసిన హోటల్‌లో విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం లంచ్ తర్వాత కాశీ ఆలయం, గంగా ఘాట్ సందర్శిస్తారు. ఆ రోజు రాత్రి వారణాసిలో బస చేస్తారు.
* రెండో రోజు హోటల్‌లో అల్పాహారం చేసి, సారనాథ్‌కు వెళ్తారు. అక్కడ దర్శనం అయ్యాక తిరిగి మధ్యాహ్నం వారణాసికి చేరుకుంటారు. అక్కడి నుంచి బిర్లా ఆలయాన్ని సందర్శిస్తారు. తరవాత లోకల్‌గా ఘాట్‌లను చూడటం, షాపింగ్ చేయడం వంటివి చేసి ఆ రాత్రి వారణాసిలోనే స్టే చేస్తారు.
* మూడో రోజు ప్రయాగ్‌రాజ్‌కి వెళ్తారు. అక్కడ అలోపీ దేవి ఆలయం, త్రివేణి సంగమం చూశాక, సాయంత్రం అయోధ్యకు బయలుదేరుతారు. రాత్రికి అయోధ్యలో బస చేస్తారు.
* నాలుగో రోజు హోటల్‌లో అల్పాహారం చేసి అయోధ్య ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం లక్నోకి బయలుదేరతారు. ఆ రాత్రి లక్నోలో బస చేస్తారు.
* ఐదో రోజు లక్నో హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసి నైమిశారణ్యానికి వెళ్తారు. ఆ రోజంతా అక్కడే గడిపి సాయంత్రం తిరిగి హోటల్‌కు చేరుకుని ఆ రాత్రి అక్కడే స్టే చేస్తారు.
* ఆరో రోజు బ్రేక్‌ఫాస్ట్ చేసి చారిత్రక బారా ఇమాంబరాను సందర్శిస్తారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు లక్నో విమానాశ్రయానికి చేరుకుని విమానంలో తిరిగి హైదరాబాద్ వస్తారు. దీంతో యాత్ర పూర్తవుతుంది.
ప్యాకేజీ ధరలు:
సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.36,850
డబుల్ ఆక్యుపెన్సీకి రూ.29,900
ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.28,200
IRCTC Ganga Ramayan Yatra ప్యాకేజీలో భాగంగా విమాన టికెట్స్, ఉదయం బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ప్యాకేజీలో భాగంగా వర్తించనివి.. విమానంలో భోజనం, టూర్ గైడ్లు, సందర్శనీయ ప్రదేశాల వద్ద టికెట్ ఫీజులు ఇతర వ్యక్తిగత ఖర్చులు.