పుడమిలో ఒక్కసారి కూడా వర్షం కురవని గ్రామం ఉందని మీకు తెలుసా..?

by Sumithra |
పుడమిలో ఒక్కసారి కూడా వర్షం కురవని గ్రామం ఉందని మీకు తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : మనం చాలావరకు ఎక్కువగా వర్షాలు కురిసే ప్రాంతాల గురించి వింటుంటాం, మాట్లాడుకుంటాం. అలాగే అక్కడి ప్రకృత్రిని, సుందర దృష్యాలను చూసేందుకు తరలివెళతాం. కానీ ఎప్పుడైనా పుడమి పుట్టినప్పటి నుంచి అసలు వర్షాలే కురవని ప్రాంతాల గురించి విన్నారా. భూమిపైన వర్షం కురిసే దృష్యాన్ని పైనుంచి చూసే గ్రామం గురించి విన్నారా. అసలు ఆ గ్రామం అంతరిక్షంలో ఉందా అనే ఆలోచనలు వస్తాయి. అక్కడి వాతావరణం కూడా చాలా విచిత్రంగా ఉంటుందంట. ఇంతకీ అంతటి విచిత్రమైన గ్రామం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం..

యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ‘అల్-హుతైబ్’ అనే గ్రామం ఉంది. భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉన్న గ్రామంలో వాతావరణం చాలా విచిత్రంగా ఉంటుంది. శీతాకాలంలో రాత్రివేల ఇక్కడ ఎముకలు కొరికే చలి ఉంటుంది. కాస్త తెల్లవారగానే సూర్యుడు ఆ ప్రాంతాన్నంతా వేడెక్కిస్తాడు. మన భూమిమీద ఉన్న వేడికన్నా అక్కడ రెట్టింపు వేడి ఉంటుంది. చలికాలంలోనే అలా ఉందంటే ఇంక వేసవి కాలం గురించి చెప్పనక్కరలేదు. ఇక ఈ గ్రామంలో ఇప్పటివరకు ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. కానీ పర్యాటకుల తాకిడి మాత్రం ఎక్కువగానే ఉంటుంది. అక్కడ ఉన్న పురాతన నిర్మాణాలు, ఆధునిక నిర్మాణాలు చూడముచ్చటగా ఉంటాయి. ఇక్కడ ఆల్ బోహ్రా లేదా అల్ ముకర్మా జాతి ప్రజలు నివసిస్తారు.

వర్షం ఎందుకు కురవదు..

ఈ గ్రామం భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో అంటే మేఘాలపైన ఉంటుంది. మరి మేఘాలకు పైన గ్రామం ఉంటే వర్షం ఎలా కురుస్తుంది. గ్రామాలు మేఘాల కింద ఉంటేనే కదా వర్షం కురిసేది. గ్రామం కింద మేఘాలు ఉండడం వలన కురిసిన వర్షం నేరుగా కిందికి పోతుంది. ఆ సుందరమైన దృష్యాన్ని ఆ గ్రామం నుంచి వీక్షించవచ్చు. అబ్బా తలచుకుంటేనే గమ్మత్తుగా ఉంది కదా..!

Advertisement

Next Story