స్థానికత ఆధారంగానే బదిలీలు చేపట్టాలి

by Shyam |
Employees
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికత ఆధారంగా మాత్రమే ఉద్యోగ బదిలీలు చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. నూతన జోనల్ విధానంలో బదిలీల ప్రక్రియ జరుగుతున్న క్రమంలో బుధవారం తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు సమావేశం నిర్వహించారు. నూతనంగా 33 జిల్లాలు ఏర్పాటవడంతో పాటు కొత్తగా 7 జోన్లు ఏర్పాటైన సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలను స్థానికతను ప్రాధాన్యతను తీసుకొని బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఒకటే పోస్టుకు ఎక్కువ మంది ఆప్షన్ ఇచ్చినప్పుడు మాత్రం సీనియారిటీని చూడాలని సూచించారు.

అంతేకాకుండా, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం స్థానిక ఉద్యోగ, ఉపాధ్యాయులను బదిలీ చేయాల్సిన అవసరం ఉంది కనుక అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి బదిలీలు చేపట్టాలని కోరారు. ఈక్రమంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా బదిలీలు జరపాలంటే.. అలాట్మెంట్ కమిటీ నుంచి టీఎన్జీవో, టీజీవో నాయకులను తొలగించాలన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమార్, ప్రధానకార్యదర్శి డా.పురుషోత్తం, మహిళా అధ్యక్షురాలు నిర్మల, కోశాధికారి బాలస్వామి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed