- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు లైట్లు మాత్రమే ఆపండి.. గ్రిడ్ గురించి కంగారొద్దు!
– ట్రాన్స్‌కో ఎండీ ప్రభాకర్ రావు
దిశ, న్యూస్ బ్యూరో: ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు రాష్ట్రంలో అందరూ లైట్స్ ఆఫ్ చేయాలని, దీని కోసం తెలంగాణ విద్యుత్ సంస్థలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయని తెలంగాణ ట్రాన్స్‌కో ఎండీ డి. ప్రభాకర్ రావు తెలిపారు. ఎలాంటి వదంతులు నమ్మకుండా.. ఆ సమయంలో ఇళ్లలోని మిగతా ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ వాడుకోవచ్చని సూచించారు. ఈ విషయమై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఇచ్చిన లైట్స్ ఆఫ్ పిలుపుపై సీఎం కేసీఆర్ సమీక్షించారని, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు. రాష్ట్రంలో కరోనా లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత 9000 నుంచి 10 వేల మెగావాట్ల మధ్య మాత్రమే విద్యుత్ డిమాండ్ నమోదవుతోందని, ఆదివారం లైట్స్ ఆఫ్ చేస్తే మరో 700 మెగావాట్ల విద్యుత్ తగ్గొచ్చని వివరించారు. దీని వల్ల రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది రాదని ఆయన చెప్పారు.
గతంలో సూర్యగ్రహణం వచ్చినపుడూ.. ఇలానే లైట్లు ఆఫ్ చేశామన్నారు. ఆ సమయంలోనూ ఒక్కసారిగా 800 మెగావాట్ల డిమాండ్ తగ్గి మళ్లీ పెరిగిందని, అయినా గ్రిడ్ పై ఎలాంటి ప్రభావం పడలేదని తెలిపారు. తెలంగాణలో గ్రిడ్ విషయమై అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నామని, రాష్ట్రంలో గ్రిడ్ నిర్వహణకు ఐసోలేటెడ్ సిస్టం ఉందన్నారు. మరీ అవసరమైతే మనకు కాలేశ్వరం ప్రాజెక్టుందని, గ్రిడ్ బ్యాలెన్సింగ్‌కు ఈ ప్రాజెక్టు పంపులు ఆన్ చేస్తామన్నారు. కరోనా లాక్‌డౌన్‌లోనూ విద్యుత్ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారని, ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనాపై పోరుకు మద్దతు తెలపాలని ప్రభాకర్‌రావు కోరారు.
Tags: corona, lights off, js grid, transco, prabhakar rao