- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శిక్షణ ఇచ్చారు.. ఉపాధి మరిచారు..
దిశ,స్టేషన్ ఘన్ పూర్: లెదర్ పార్క్ రాకతో స్థానిక చర్మకారులు ఆనందంలో మునిగిపోయారు. ఉపాధి లభిస్తుందని సంబురపడ్డారు. 18 ఏండ్ల కిందట కొంత మందికి ట్రైనింగ్ కూడా ఇప్పించారు. ఆ తర్వాత పార్కు అభివృద్ధిని మరిచిపోయారు. దీంతో అది మూతపడింది. తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన చర్మకారులకు నిరాశే ఎదురైందని వాపోతున్నారు. నేర్చుకున్న మెలకువలు మరిచిపోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన చెందుతున్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని చర్మకారులకు షూ, చెప్పులు, లెదర్ బ్యాగుల తయారీపై శిక్షణ ఇచ్చి ఉపాధి చూపిస్తామన్న పాలకులు శిక్షణ ఇప్పించారు తప్ప ఉపాధి చూపలేకపోయారు. ఫలితంగా శిక్షణ పొందిన మాస్టర్లు, వారి వద్ద శిక్షణ చర్మకారులు ఉపాధి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఫలితంగా మినీ లెదర్ పార్క్ శిథిలావస్థకు చేరుకుంది. అందులోని యంత్రాలు తుప్పు పడుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో 18 ఏళ్ల కిందట దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో అప్పటి ప్రభుత్వం మినీ లెదర్ పార్కును ఏర్పాటు చేసింది. ఇందులో నియోజకవర్గానికి చెందిన చర్మకారులకు శిక్షణ ఇచ్చారు. చెప్పులు, షూ, లెదర్ బ్యాగులు తయారు చేసేందుకు కావలసిన యంత్ర సామాగ్రి సమకూర్చారు. ఈ మినీ లెదర్ పార్కులో శిక్షణ ఇచ్చేందుకు 14 మందిని ఎంపిక చేసి 2003లో శిక్షణ కోసం మద్రాస్‌కు పంపారు. శిక్షణ పొందిన ఆ 14 మంది మినీ లెదర్ పార్కులో మరికొంత మంది చర్మకారులకు శిక్షణ ఇచ్చారు.
అన్ని వసతులు అక్కడే..
శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు వారి ద్వారా శిక్షణ తీసుకున్న వారితో మినీ లెదర్ పార్కులో ఉత్పత్తులు ప్రారంభించి అక్కడ పనిచేసే చర్మకారుల పిల్లల కోసం పాఠశాల, వైద్యం కోసం ఆస్పత్రి ఏర్పాటు చేసి బ్యాంకు రుణాల ద్వారా చర్మకారులను ప్రోత్సహించాలని లక్ష్యం. కానీ అవేమీ నెరవేరక పోగా కనీసం లెదర్ పార్కును ముందుకు నడిపించే వారు లేని దుస్థితి నెలకొంది. దీంతో మినీ లెదర్ పార్క్ ద్వారా ఉపాధి లభిస్తుంది అనుకున్న వారికి నిరాశే ఎదురైంది.
పట్టించుకోని పాలకులు..
లెదర్ పార్కు ఏర్పాటుతో తమ బతుకులు బాగుపడుతాయని స్థానిక చర్మకారులు భావించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం లెదర్ పార్కును పట్టించుకున్న పాపాన పోవడం లేదు. భవనం శిథిలావస్థకు చేరగా యంత్ర సామగ్రి తుప్పు పట్టింది. దీంతో చర్మకారులు ఆశలు వదులుకున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నేర్చుకున్నది సైతం మరిచిపోతున్నామని వాపోతున్నారు. మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మినీ లెదర్ పార్క్ వినియోగంలోకి తెస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చాలని చర్మకారులు కోరుతున్నారు.
కూలి పనికి వెళుతున్నా.. చేపూరి కుమార్, చాగల్లు
మద్రాసులో శిక్షణ తీసుకొని 18 ఏళ్లు గడిచింది. నేర్చుకున్న పని మర్చిపోయిన. జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్న. పని దొరకకపోవడంతో కూలి పనికి వెళ్తున్నాను. మినీ లెదర్ పార్క్ వినియోగంలోకి తెస్తే చాలామందికి ఉపాధి దొరుకుతుంది.
పని కల్పించే వారు లేరు -గాదె ఈశ్వర్, ఘన్‌పూర్
మాస్టర్ ట్రైనర్‌గా 45 రోజులు ట్రైనింగ్ తీసుకున్న. పలువురికి శిక్షణ కూడా ఇచ్చా. మాకు పని చూపే వాళ్ళు లేరు. లెదర్ పార్క్‌ను పట్టించుకున్న వారు లేరు. స్థానికంగా చెప్పుల దుకాణం పెట్టుకొని జీవనోపాధి పొందుతున్న.