- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వొడాఫోన్ ఐడియాకు ట్రాయ్ షోకాజ్ నోటీసులు !
దిశ, వెబ్‌డెస్క్: వొడాఫోన్ ఐడియా(Vodafone Idea) తన పోస్ట్‌పెయిడ్(postpaid) కస్టమర్లకు రెడ్ఎక్స్(RedX) పేరుతో ప్రత్యేక ప్రీమియం ప్లాన్ సేవలను అందిస్తోంది. ఈ ప్లాన్ కొందరు వినియోగదారులకు మాత్రమే లాభం చేకూరుస్తోందనే ఆరోపణలతో టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్(TRAI) వొడాఫోన్ ఐడియాకు షోకాజ్ నోటీసుల(Show-Cause Notice)ను జారీ చేసింది. ఇప్పటికే ఉన్న అప్పులు, ఏజీఆర్ బకాయిల వల్ల కష్టాలను ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియాకు ఇది మరో షాక్. కొందరికి మాత్రమే ఉపయోగపడేలా ఉన్న ఈ ప్లాన్ నియంత్రణ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నందున ఎందుకు చర్యలు తీసుకోకూడదో కారణాలు చెప్పాలని, ఆగష్టు 31 లోపు సమాధానం ఇవ్వాలని ట్రాయ్ కోరింది. కానీ, ఇలాంటి ప్లాన్‌ను ఇస్తున్న ఎయిర్‌టెల్(Bharti Airtel )కు నోటీసులేవీ ఇంకా ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా, వొడాఫోన్ ఐడియా డేటా స్పీడ్, ప్రత్యేక కష్టమర్ కేర్ సౌకర్యాలతో రెడ్ ఎక్స్ ప్లాన్‌ను అందిస్తోంది. ఎయిర్‌టెల్ నుంచి కూడా ఇలాంటి సౌకర్యాలతోనే ప్లాటినం ప్లాన్‌తో పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ప్రీమియం సేవలను అందిస్తోంది. గతంలో ఈ అంశంపై ట్రాయ్ రెండు సంస్థలను ప్రశ్నించింది. ఆయా ప్లాన్‌లకు సంబంధించిన డేటాను ఇవ్వాలని చెప్పగా, ఎయిర్‌టెల్ ప్లాన్‌లలో మార్పులు చేసింది.