మారథాన్ రేస్.. 20మంది రన్నర్లు మృతి

by Anukaran |   ( Updated:2021-05-22 23:28:14.0  )
మారథాన్ రేస్.. 20మంది రన్నర్లు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: చైనాలో విషాదం చోటుచేసుకుంది.. ప్రతికూల వాతావరణం కారణంగా మారథాన్ లో పాల్గొన్న 20మంది రన్నర్లు మృత్యువాత పడ్డారు. ఈశాన్య చైనా హువాంగే షిలిన్‌ పర్వతాల దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే శనివారం బైయిన్‌ నగరానికి సమీపంలోని యల్లో రివర్‌ స్టోన్‌ అటవీ ప్రాంతంలో కొండలపై 100 కిలోమీటర్ల పర్వత మారథాన్‌ నిర్వహించారు. ఈ మారథాన్ లో 172 మంది పాల్గొన్నారు. ఆ సమయంలో వాతావరణం అంతా పొడిగా, ఎండగా ఉండడంతో మారథాన్ నిరాటకంగా కొనసాగింది. అయితే సడెన్ గా వాతావరణం మారిపోయింది.

పరుగు కొనసాగుతున్న సమయంలో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఒక్క సారిగా భారీ వర్షం వడగళ్లు, చలి గాలులు వీచాయి. దీంతో రన్నర్లు ఆ గాలులు తట్టుకోలేకపోయేవారు.. గాలికి చెల్లాచెదురుగా పడిపోయారు. అందులో కొంతమంది హైపోథెర్మియా బారిన పడి స్పృహ కోల్పోయారు. అప్పటికే 20మంది రన్నర్లు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న మారథాన్ నిర్వాహకులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పలువురు రన్నర్లను కాపాడారు. గల్లంతైన రన్నర్ల కోసం 1200 రెస్క్యూ టీంలుగా ఏర్పడ్డాయి. ఆదివారం ఉదయం లోపు 151 మందిని సురక్షితంగా కాపాడగా, వీళ్లలో ఎనిమిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed