వికారాబాద్‌కు రాకపోకలు లేవు!

by  |
వికారాబాద్‌కు రాకపోకలు లేవు!
X

దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ లో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు, చెరువులు, కంటలు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వరదల కారణంగా గురువారం రాత్రి కోట్ పల్లి ప్రాజెక్టు రోడ్డు వంతెన తెగిపోయింది. దీంతో తాండూర్-వికారాబాద్ రాకపోలకు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో జిల్లా ప్రజలు తీవ్ర అస్థలు ఎదుర్కొంటున్నారు.

ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఓ పక్క కరోనా మరో పక్క వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. మరో పక్క మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


Next Story

Most Viewed