- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాఫిక్ చలాన్లు చెల్లించని వారికి షాక్.. పోలీసుల కీలక నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో: వాహనం నడిపే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. ఒకవేళ ఉల్లంఘిస్తే జరిమానాలు చెల్లించక తప్పదు. అంతేకాకుండా, మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే పోలీసు కౌన్సిలింగ్‌కు హాజరు కావాల్సిందే. కానీ ఇకపై ట్రాఫిక్ చలాన్లు చెల్లించకపోయినా కౌన్సిలింగ్‌కు రావాల్సిందే అంటున్నారు సైబరాబాద్ పోలీసులు. హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా నిబంధనలు ఉల్లంఘిస్తూ చలాన్లు వేసినా కొందరు వాహనదారులు పట్టించుకోవడం లేదు.
అలాంటి వారిపై దృష్టిసారించిన సైబరాబాద్ పోలీసులు పది, అంతకంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాల వివరాలు సేకరించారు. ఇందులో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల వారిగా వేరు చేసి సంబంధిత ఇన్‌స్పెక్టర్‌కు పంపించారు. ఇక ఆయా స్టేషన్ల నుంచి వాహన యజమానులకు ఫోన్లు చేసి కౌన్సిలింగ్‌కు పిలుస్తున్నారు. స్టేషన్‌కు వెళ్లగానే అక్కడి నుంచి ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్(టీటీఐ)కు పంపిస్తున్నారు. ఇక అక్కడ కౌన్సిలింగ్ నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులకు కౌన్సిలింగ్ సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తున్నారు.