- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ట్రాఫిక్’ఫైన్ వసూళ్లు..
దిశ, క్రైమ్ బ్యూరో :
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఇప్పటి వరకు పత్రాలను మాత్రమే తనిఖీ చేసిన వారు ఇప్పుడు హెల్మెట్ మీద కూడా దృష్టి సారించారు. హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే, మొదటిసారి మూడు నెలల పాటు లైసెన్సును సస్పెండ్ చేస్తామని, రెండో సారి పట్టుబడితే ఏకంగా రద్దు చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. దీంతో వాహనదారులు తమ టూ వీలర్లను బయటకు తీయాలంటే బెంబేలెత్తుతున్నారు. గడిచిన ఆరు నెలల్లో హెల్మెట్ ధరించని కారణంగా సైబరాబాద్ పరిధిలో దాదాపు ఎనిమిది లక్షల మంది వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.
ఆదాయం కోసమేనా..
కరోనా నేపథ్యంలో మార్చి మూడో వారం నుంచి ఏప్రిల్ నెలంతటా లాక్ డౌన్ కొనసాగింది. ఆ తర్వాత క్రమేపీ సడలింపులు చేస్తూ వచ్చారు. నిదానంగా వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. హెల్మెట్ లేనందున జరిమానాలు విధించే అంశాలపై ట్రాఫిక్ పోలీసులకు, వాహనదారులకు తరుచూ వివాదాలు చోటు చేసుకున్నాయి. హెల్మెట్ అంశాన్ని లైట్‌గా తీసుకున్నా.. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ తదితర పత్రాల విషయంలోనే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించేవారు. కరోనా కారణంగా 40 రోజులకు పైగా ఎలాంటి ఆదాయం లేకుండా పోయింది. దీంతో ట్రాఫిక్ సిబ్బంది తమ శాఖకు ఆదాయం తెచ్చిపెట్టే మార్గాలను ఎంచుకున్నారు. అందులో భాగంగానే వాహనాలను ఎక్కడా నిలపకుండానే ట్రాఫిక్ సిబ్బంది తమ కెమెరాలలో బంధిస్తూ హెల్మెట్ ధరించనివారిపై ఫోకస్ చేశారు. వెనుక కూర్చున్న పిలియన్ రైడర్లను కూడా పోలీసులు వదలటం లేదు.
6 నెలల్లో.. 8.67 లక్షలు
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాల్లో హెల్మెట్ ధరించనివారివే అత్యధికంగా ఉన్నాయి. 90 శాతానికి పైగా ఇవే కావడం గమనార్హం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2020 మే నుంచి 2020 అక్టోబరు వరకూ మొత్తం 8.67 లక్షల జరిమానా విధించగా.. అందులో ఒక్క హెల్మెట్ ధరించని వారు 8.63 లక్షల మంది ఉన్నారు. మోటారు వాహనాల యాక్ట్ ప్రకారం హెల్మెట్ ధరించకపోతే అత్యధికంగా రూ.200 జరిమానా విధించే అవకాశం ఉంది. మన పోలీసులు కనీసం రూ.100 విధిస్తారు. ఈ జరిమానా చెల్లించే సమయంలో మీ సేవా ఫీజు రూపంలో మరో రూ.30 చెల్లించాల్సి ఉంటోంది. ఈ ప్రకారం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక్క హెల్మెట్ ధరించని కారణంగానే వాహనదారుల నుంచి సుమారు రూ.8 63 కోట్లు రానున్నాయి. మీ సేవా రుసుం రూపంలో మరో రూ.2.59 కోట్లను వాహనదారులు చెల్లించాల్సి ఉంటోంది. ఇదిలా ఉండగా, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసేవాళ్లు 2,283, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేకుండా 101 మంది, ఇన్సూరెన్స్ లేకుండా 1429 మంది, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా 405 మందికి ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించారు.
హెల్మెట్ లేని వారికి జరిమానాలు ఇలా..
మే 2,83,377
జూన్ 2,47,497
జూలై 1,77,058
ఆగష్టు 0,67,863
సెప్టెంబరు 0,40,209
అక్టోబరు 0,47,337
మొత్తం – 8,63,341