- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫెస్టివల్ సేల్‌ను నిషేధించాలి
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీలు అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్ సందర్భంగా సరికొత్త ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫెస్టివ్ సీజన్ సేల్‌ను నిషేధించాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అందించే పండుగ ఆఫర్ అమ్మకాలను నిషేధించాలని లేదంటే ప్రభుత్వానికి జీఎస్టీ, ఆదాయ పన్ను ఎగవేసే అవకాశమున్నట్టు ఆ లేఖలో పేర్కొంది. దీనికోసం స్పెషన్ టాస్క్ ఫోర్స్‌ను నియమించాలని కోరింది.
ఈ నెల 16 నుంచి 21 మధ్య ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తుండగా, అమెజాన్ 17 నుంచి నెల రోజుల పాటు ఈ ఆఫర్‌ను నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు సుమారు 80 శాతం వరకు రాయితీని ఇస్తున్నాయి. 10 శాతం నుంచి 80 శాతం వరకు భారీగా డిస్కౌంట్స్‌ను ఇవ్వడం వల్ల వాస్తవ ధర కంటే తక్కువకే వస్తువులు విక్రయించబడుతున్నాయి. ఇది ఓ రకంగా దోపిడీ అని సీఏఐటీ వివరించింది. సాధారణ వస్తువుల వాస్తవ ధరపై వసూలు చేయవలసిన జీఎస్టీని, డిస్కౌంట్లను తీసేసిన తర్వాతి ధరపై వసూలు చేయడం వల్ల ప్రభుత్వానికి నష్టమని తెలిపింది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా వినియోగదారులకు అవసరమైన వస్తువులను తక్కువ ధరకే ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం కోల్పోయేలా చేస్తుందని సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ లేఖలో పేర్కొన్నారు.