ట్రాక్టర్ డ్రైవర్ మృతి.. గంజాయి లభ్యం

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా పలమనేరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రాక్టర్‌ను బొలెరో వాహనం ఢీ కొట్టిన ప్రమాదంలో.. ట్రాక్టర్ డ్రైవర్ పరదేశి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనంలో గంజాయి లభ్య కావడం గమనార్హం. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. ప్రమాదం జరగ్గానే బొలెరో వాహనంలోని వ్యక్తులు పరారైనట్లు స్థానికులు తెలిపారు.

Advertisement