- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్ అనుమతితోనే జగన్ ఆ జీవో ఇచ్చాడు : రేవంత్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్ : కృష్ణా నీళ్ల కోసం అటు ఏపీ, ఇటు తెలంగాణ మధ్య మళ్లీ వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. అయితే, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పత్తి చేయకూడదని ఏపీ వాదిస్తుండగా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు అని తెలంగాణ ఆరోపిస్తోంది. తాజాగా ఈ జలవివాదం కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృష్ణా నీళ్లను రాయలసీమకు తరలిస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఈ చర్య తెలంగాణ హక్కులకు భంగం కల్గించడమే అని అన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసినా సీఎం కేసీఆర్ స్పందించలేదన్నారు.
కేసీఆర్ అనుమతితోనే జగన్ జీవో నెంబర్ 203 ఇచ్చారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ గుర్తుచేశారు. జగన్ సీఎం పగ్గాలు చేపట్టిన కొత్తలో ఇరు ముఖ్యమంత్రులు భేటీ అయి బేసిన్లు, భేషజాలు లేవని చెప్పింది కేసీఆర్ కదా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ కావాలనే తెలంగాణ ప్రజల మనోభావాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డి పాడుతో మహబూబ్ నగర్, రంగారెడ్డి ఎడారిగా మారుతాయని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.