- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణకు రాహుల్ గాంధీ.. వచ్చేనెల కాంగ్రెస్ భారీ బహిరంగసభ
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చేనెల 9న రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి ప్రకటించారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. మార్చి వరకు రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వం చేయించాలని పార్టీ నేతలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మెంబర్ షిప్కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చేనెల 9న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో భారీ సభను ఏర్పాటు చేస్తున్నామని, దానికి రాహుల్‌గాంధీని ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఈ సభకు వచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు చెప్పారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న సభ్యుల రక్షణ కోసం రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.
చిల్లర రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌కు పోటీనే కాదని, తెల్ల దొరల నుంచి దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబ నాయకత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ అని, ఇతర పార్టీల నాయకత్వంలో సగం బ్రోకర్లు, సగం లోఫర్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రాజభరణలు రద్దు చేసిందని, బ్యాంక్‌లు జాతీయం చేసిందని, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిందని గుర్తుచేశారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ అని, ఐటీని అభివృద్ధి పరిచి కంప్యూటర్, సెల్‌ను అందరికీ పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ అని అన్నారు. తెలంగాణలో 30 లక్షల సభ్యత్వం చేస్తామని సోనియాకు మాటిచ్చామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ మాటను నిలబెట్టుకునే బాధ్యత ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త మీద ఉందని, నవంబర్ 9, 10 తేదీల్లో జిల్లా, మండల అధ్యక్షులకు శిక్షణ ఉంటుందన్నారు. వరి కొనకుండా ప్రభుత్వం రైతులను ఉరికి ఉసి గొల్పుతోందని మండిపడ్డారు. మహేష్ అనే నిరుద్యోగి లేఖ రాసి చనిపోయాడని, ఈ నెల 14నుంచి 21 వరకు ఏడు రోజులు గ్రామాల్లో జన జాగరణ యాత్రలు నిర్వహించనున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతీ బూతులో వందమంది సభ్యత్వంతో మొత్తం 34 వేల బూతుల్లో 30 లక్షల సభ్యత్వం టార్గెట్ చేయాలని కోరారు. రాష్ట్రంలో, దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీలో సభ్యత్వం తీసుకున్న వారికి కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల్లో మొదటి ప్రాధాన్యత ఉంటుందని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోవడం అదృష్టం : భట్టి
1885లో స్థాపించిన కాంగ్రెస్ దేశానికి స్వాతంత్రం తెచ్చిందని.. నవ భారత నిర్మాణానికి పునాదులు వేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అలాంటి కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోవడం గొప్ప అదృష్టమని, తెలంగాణలో 30 లక్షల సభ్యత్వం చేయాలన్నారు. ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్న పార్టీ దేశాన్ని పాలిస్తోందని, జాతిని విచ్ఛిన్నం చేస్తోందని, అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసేది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష గట్టి కాంగ్రెస్ కార్యకర్తల మీద భౌతిక దాడులు చేస్తోందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంత రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.