స్టైలిష్ లుక్‌లో టొవినో థామస్.. ‘ఫోరెన్సిక్’ సెలబ్రేషన్స్‌లో రివీల్

by Jakkula Samataha |
స్టైలిష్ లుక్‌లో టొవినో థామస్.. ‘ఫోరెన్సిక్’ సెలబ్రేషన్స్‌లో రివీల్
X

దిశ, సినిమా : మలయాళ సినిమా ‘ఫోరెన్సిక్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అఖిల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ప్లస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా లీడ్ యాక్టర్స్ టొవినో థామస్, మమతా మోహన్ దాస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. సినిమాలో ఫోరెన్సిక్(Forensic) ఎక్స్‌పర్ట్‌గా టొవినో థామస్ నటించగా, ఐపీఎస్ ఆఫీసర్‌గా మమతా మోహన్ దాస్ కనిపించారు. కాగా సెలబ్రేషన్స్‌లో డైరెక్టర్‌ను మిస్ అవుతున్నట్లుగా టొవినో, మమత తెలిపారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులకు థాంక్స్ చెప్తూ ఇన్‌స్టా వేదికగా సెలబ్రేషన్స్ ఫొటోస్ షేర్ చేసింది మమత. ఇక ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న టొవినో థామస్ నయా లుక్‌ ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. టొవినో ప్రస్తుతం ‘మిన్నల్ మురళి, కాలా, అజయంతె అజయంతె రండం మోషనం’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Advertisement

Next Story