- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కార్మికుల సంఖ్యకు అనుగుణంగా కొత్త డిస్పెన్సరీలు

దిశ, తెలంగాణ బ్యూరో: కార్మికుల సంఖ్యకు అనుగుణంగా డిస్పెన్సరీలను ఏర్పాటు చేయాలని ఎంప్లాయిస్స్టేట్ ఇన్సూరెన్స్కార్పొరేషన్ (ESIC) యోచిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి (CM Revanth reddy) ఆధ్వర్యంలో కార్మిక శాఖపై సమీక్ష సమావేశం జరిగింది. ఆ సమయంలోనే ESIC డిస్పెన్సరీ ఆసుపత్రుల ప్రస్తావన వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 వరకు ESIC డిస్పెన్సరీలు ఉండగా, హైదరాబాద్ ఎర్రగడ్డలోని ESIC ప్రధాన ఆసుపత్రికే కార్మికులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ క్రమంలో రోగుల సంఖ్యను తగ్గించేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాలలో సుమారు 18 డిస్పెన్సరీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవే కాకండా రాష్ర్ట వ్యాప్తంగా మరో 20 నుంచి 25 వరకు ఈఎస్ఐసీ డిస్పెన్సరీల అవసరం ఉంటుందని వైద్యులు తెలియజేస్తుండడం గమనార్హం. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ 18 డిస్పెన్సరీలలో ప్రాథమిక వైద్యంతో పాటు రెఫరెల్సేవలు, మందుల పంపిణీ వంటి సేవలను అందిస్తాయి. డిస్పెన్సరీల బాధ్యతను ఈఎస్ఐసీనే చూసుకోనుంది. ఆ విధంగా ఈఎస్ఐసీ ఆసుపత్రుల సామర్ధ్యాన్ని పెంచడంతో పాటు కొత్త ఆసుపత్రుల నిర్మాణానికి కూడా కేంద్ర కార్మిక శాఖ నే చూసుకోనుండడం విశేషం.