నీ కుటుంబం బాగోతం మొత్తం బయటపెడతా.. కడియం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్

by Ramesh Goud |
నీ కుటుంబం బాగోతం మొత్తం బయటపెడతా.. కడియం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: నీ కుటుంబం చేస్తున్న దౌర్జన్యాలను మొత్తం బయటపెడతాం జాగ్రత్త అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari)ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (BRS MLA Palla Rajeshwar Reddy) హెచ్చరించారు. తనపై వస్తున్న భూఆరోపణలపై కడియం స్పందిస్తూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah)లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మె్ల్యే పల్లా స్పందిస్తూ.. కడియల్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.

ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. మా పార్టీ కండువా మీద, కేసీఆర్ పేరు మీద గెలిచి, పదవులు పైసల కోసం వేరే పార్టీకి పోయిన నువ్వు మా నీతి, నిజాయితీల గురించి మాట్లాడుతావా? అని మండిపడ్డారు. చీము, నెత్తురు ఉంటే నిరూపించమని అడిగావ్ కదా.. నీ అండ దండలతో అక్రమాలకు పాల్పడుతున్న నీ ఆంధ్రా అల్లుడి భాగోతం మొత్తం నిరూపిస్తాము జాగ్రత్తగా ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక దేవునూరులో అటవీ భూముల పక్కన 24 ఎకరాల భూమిని ఒక నెల రోజుల కింద నీ బినామీ పేరు మీద కొనలేదా?, ఆ భూమికి రోడ్డు వేసుకోవడానికి, పక్కన భూమి వాళ్లను బెదిరించావా లేదా? అని నిలదీశారు.

నీ అధికార అహంకారం, నీ బిడ్డ ఎంపీ పదవిని అడ్డం పెట్టుకొని, నీ ఆంధ్రా అల్లుడు పోలీసు రిక్రూట్మెంట్లు ఎలా చేస్తున్నాడో మాకు తెలుసని, రెవెన్యూ అధికారులను గుప్పెట్లో పెట్టుకోని నీ కుటుంబం చేస్తున్న దౌర్జన్యాలను మొత్తం ప్రజల ముందు పెడతామని పల్లా వ్యాఖ్యానించారు. కాగా అంతకుముందు కడియం శ్రీహరి తనపై భూకుంభకోణం ఆరోపణలపై మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాటికొండ రాజయ్య ఇద్దరూ దేవనూరుగుట్టలను సందర్శించాలని, తనపై చేసిన కబ్జా ఆరోపణలపై క్షేత్రస్థాయిలో పర్యటించి, నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీకు గులాంగిరీ చేస్తానని, నిరూపించకపోతే మీ ఇద్దరు కలిసి నాకు గులాంగిరీ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed