‘తెలంగాణ టూరిజాన్ని ప్రపంచ పటంలో నిలుపుతాం’

by Shyam |
‘తెలంగాణ టూరిజాన్ని ప్రపంచ పటంలో నిలుపుతాం’
X

దిశ, హాలియా: తెలంగాణ టూరిజాన్ని ప్రపంచ పటంలో నిలుపుతామని తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాసగుప్త అన్నారు. మంగళవారం హాలియాలో ఆయన ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలోనే తెలంగాణ టూరిజం ప్రాంతాలను అద్భుతంగా అభివృద్ధి చేసిందన్నారు. ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన బుద్దవనం ప్రాజెక్టు పనులు పూర్తికావొచ్చాయని, త్వరలోనే ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ చేత ప్రారంభిస్తామని అన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ను కూడా అంతర్జాతీయ స్థాయిలో ఒకటిగా నిలిపేందుకు రూ.1.15కోట్లతో క్రూస్ బోట్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో టూరిజంను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.50కోట్లతో శిల్పారామాన్ని ప్రారంభించనున్నట్లు వివరించారు.

Next Story

Most Viewed