- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
India Economy: భారత వృద్ధికి ఢోకా లేదు: డబ్ల్యూఈఎఫ్
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిణామాల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత వృద్ధికి ఢోకా లేదని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) నివేదిక వెల్లడించింది. దక్షిణాసియా వృద్ధికి కీలక డ్రైవర్‌గా భారత్ మెరుగైన పనితీరును కలిగి ఉందని తెలిపింది. అయితే, దేశీయంగా పెరుగుతున్న రుణ స్థాయిలతో ఆర్థిక సవాళ్లు ఆందోళనకరంగా ఉన్నాయని అభిప్రాయపడింది. పెరుగుతున్న రుణ వ్యయం కారణంగా మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులకు ఆటంకంగా మారిందని, దానివల్ల స్థిరమైన వృద్ధికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని పేర్కొంది. అయితే, ద్రవ్యోల్బణం లక్ష్యం పరిధిలో ఉండటం, అంతర్జాతీయ వాణిజ్యం రికవరీ వల్ల వృద్ధిపై సానుకూల సంకేతాలు కొనసాగుతున్నాయి. కానీ, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలలో పెరిగిన రుణ స్థాయిలు ముఖ్యమైన సవాళ్లు మారుతున్నాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి మార్కెట్లలో రానున్న సంవత్సరాల్లో డిఫాల్ట్‌లు పెరుగుతాయని డబ్ల్యూఈఎఫ్ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. దాదాపు 39 శాతం మంది ఆర్థికవేత్తలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది ఆయా ఆర్థికవ్యవస్థల బలహీనతను మరింత పెంచుతుందని వివరించింది. మరోవైపు ప్రపంచ ఆర్థికవ్యవస్థ స్థిరంగా ఉన్నప్పటికీ ఆర్థిక సవాళ్లు ఎక్కువ నష్టం కలిగించే ప్రమాదం ఉందని డబ్ల్యూఈఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సాదియా జాహిది వెల్లడించారు.