- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలు విక్రయించే రాకెట్ గుట్టురట్టు.. ఏడుగురు అరెస్ట్
దిశ, చార్మినార్: చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే నిరుపేదలకు నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలను విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టును సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాదర్‌ఘాట్ పోలీసులతో కలిసి రట్టు చేశారు. ముఠాలోని ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, వివిధ విశ్వ విద్యాలయాల డిగ్రీ సర్టిఫికేట్లతో పాటు 11 సెల్ఫోన్లు, 4ల్యాప్ టాప్‌లు, రూ. 20 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రతో కలిసి టాస్క్‌ఫోర్స్ డీసీపీ గుమ్మి చక్రవర్తి వివరాలు వెల్లడించారు.
బజార్‌ఘాట్ కు చెందిన మొహమ్మద్ హబీబ్(32), మలక్‌పేట్‌లో ఫ్లై అబ్రాడ్ కన్సల్టెన్సీ. మొహమ్మద్ హబీబ్ రాయల్కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బిటెక్ చదివాడు. అనంతరం టోలిచౌకిలోని రిలయన్స్ అకాడమి కన్సల్టెన్సీలో అడ్మినిస్ట్రేటర్‌గా చేరాడు. ఆ సమయంలో అతను ఎడ్యుకేషనల్ మార్కెటింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఢిల్లీ వాసి సునీల్ కపూర్‌ను కలిశాడు. ఆ పరిచయం కాస్త వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. సులువుగా డబ్బులు సంపాదించేందుకు నకిలీ విద్యా సర్టిఫికేట్లను విక్రయించాలని పథకం వేశారు. అందులో భాగంగానే చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే నిరుపేదలను టార్గెట్ చేసేవారు. 2015లో మలక్‌పేట్‌లో ఫ్లై అబ్రాడ్ కన్సల్టెన్సీ పేరుతో ఎండీ హబీబ్ కన్సల్టెన్సీని ప్రారంభించారు.
అప్పటి నుంచి సునీల్ కపూర్ సహకారంతో సకల విద్యార్హత సర్టిఫికేట్లు అందజేస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయమై బహదూర్‌పురా, సరూర్‌నగర్ పోలీస్స్టేషన్లలో అరెస్ట్ కూడా అయ్యాడు. జైలు నుంచి విడుదల అయ్యాక తన ప్రవర్తనలో మార్పు కనిపించకపోగా చిలకల్ గూడకు చెందిన అబ్దుల్ రవూఫ్ (36), సంతోష్‌నగర్‌కు చెందిన మొహమ్మద్ ఇర్ఫాన్ (28), ఈదిబజార్ కు చెందిన షానవాజ్ ఖాన్ (29), నాంపల్లికి చెందిన మొహమ్మద్ జుబేర్ (34), మల్లేపల్లికి చెందిన సల్మాన్ ఖాన్(29), మలక్‌పేట్ కు చెందిన మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ (33)ల సహకారంతో పెద్ద ఎత్తున నకిలీ విద్యార్హత సర్టిఫికేట్లను విక్రయిస్తున్నారు. కాగా అమెరికా, యూకేలో విదేశీ చదువుల పేరుతో వినియోగదారులకు భద్రత కల్పిస్తూ నకిలీ విద్యా సర్టిఫికేట్లు అందించి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు.
వచ్చిన సొమ్మును వాటాల పద్దతిలో పంచుకుంటారు. ఇది ఇలా ఉంటే ఎలాంటి పరీక్షలు లేకుండా యూనివర్సిటీలు, కాలేజ్ ల వెనుక డోర్ నుంచి నకిలీ విద్యాధృవీకరణ పత్రాలను అందజేస్తామని మభ్యపెట్టే అంతరాష్ట్రాల ఏజెంట్లను నమ్మవద్దని, ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నకిలీ విద్యా ధృవపత్రాలు స్వాధీనం..
తెలంగాణ యూనివర్శిటీ, ఆంధ్రాయూనివర్శిటీ, రాయలసీమ విశ్వ విద్యాలయం (ఏపీ), రాజస్థాన్ నర్సింగ్ కౌన్సిల్, సింబయాసిస్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్శిటీ (ఫూణె), ఛత్రపతి షాహు జీ మహరాజ్ విశ్వ విద్యాలయం (కాన్పూర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్(మహారాష్ట్ర) , సెకండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్( పూణే), బెంగళూరు విశ్వవిద్యాలయం, అన్వర్ ఉలూం కాలేజ్ (మల్లేపల్లి), తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్, ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్), కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్( న్యూఢిల్లీ), ఎం. అన్నా యునివర్శిటీ (తమిళనాడు), రాజస్థాన్ యూనివర్శిటీ ఫర్ హెల్డ్ సైన్స్ లకు చెందిన నకిలీ విద్యాసర్టిఫికేట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.