ఆండ్రాయిడ్ 11‌లో ఏం ఫీచర్స్ ఉన్నాయి?

by Harish |
ఆండ్రాయిడ్ 11‌లో ఏం ఫీచర్స్ ఉన్నాయి?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆండ్రాయిడ్ 11 ఓఎస్ బీటా వెర్షన్ ప్రస్తుతం కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఆ బీటా వెర్షన్‌కు గూగుల్ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ.. కొత్త కొత్త ఫీచర్స్‌ను యాడ్ చేస్తోంది. ఇప్పటికే కొంతమంది ఆండ్రాయిడ్ 11 యూజర్లు న్యూ ఫీచర్స్‌ను ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్‌ 8న ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాబోతుందని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి అందులోని కొన్ని అట్రాక్టివ్ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం.

బబుల్స్: ఫేస్‌బుక్ మెసెంజర్స్‌లో చాట్ బబుల్స్ గురించి తెలిసిందే. ఆండ్రాయిడ్ 11 కూడా డిఫరెంట్ యాప్స్‌కు ఈ చాట్ బబుల్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఈ చాట్ బబుల్స్ వల్ల ఉపయోగం ఏంటంటే.. ఫోన్‌లో మనం వేరే ఏదైనా పని చేసుకుంటున్న టైమ్‌లో మెసేజ్ వస్తే.. వెంటనే అక్కడి నుంచే రిప్లయ్ ఇవ్వొచ్చు.

డివైజ్, మీడియా కంట్రోల్: బ్లూ టూత్ డివైజెస్‌కు, మీడియా ప్లేయర్స్‌కు మోర్ కంట్రోల్స్ ఆప్షన్స్‌ను తీసుకు రానుంది.

స్క్రీన్ రికార్డింగ్: ఐఫోన్ వినియోగదారులు స్క్రీన్ రికార్డింగ్ ఫీచర్‌ను ఎప్పటినుంచో వినియోగిస్తున్నారు. గూగుల్ తమ ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా తమ రాబోయే ఓఎస్‌లో ఈ అవకాశం తీసుకురాబోతుంది. స్క్రీన్ రికార్డింగ్‌తో పాటు ఆడియో కూడా రికార్డ్ చేసే సౌలభ్యం రానుంది.

కన్వర్జేషన్స్: ఈ ఫీచర్‌లో భాగంగా.. ‘కన్వర్జేషన్స్’ ప్రియారిటీ కేటాయించవచ్చు. ముఖ్యమైన చాట్స్‌ను మార్క్ చేసి, వాటిని హోమ్ స్క్రీన్ మీదకు యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదు వాటికి రిమైండర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు.

ప్రైవసీ: ఆండ్రాయిడ్ 10లో కూడా ప్రైవసీకి ప్రాముఖ్యతనిచ్చింది గూగుల్. ఆండ్రాయిడ్ 11లో ప్రైవసీని మరింత పటిష్టంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. యాప్ పర్మిషన్స్‌కు ఆటో రీసెట్ ఆప్షన్‌ను కూడా తీసుకురాబోతుంది.

Advertisement

Next Story

Most Viewed