స్పైస్ జెట్‌పై సోను.. రియల్ హీరోకు అరుదైన గౌరవం!

by Anukaran |   ( Updated:2021-03-20 04:50:02.0  )
Sonusood SpiceJet
X

దిశ, సినిమా : లాక్‌డౌన్ టైమ్‌లో సమస్య ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమై పరిష్కారానికి కృషి చేసిన రియల్ హీరో సోనుసూద్. తెరపై విలన్‌గా కనిపించినా, నిజజీవితంలో మాత్రం హీరోగా నిరూపించుకున్నాడు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి వేరే చెప్పనక్కర్లేదు. వలస కూలీలు, విద్యార్థులు, వృద్ధులు ఒక్కరేమిటి సోషల్ మీడియా ద్వారా ఎవరు సాయం కోసం రిక్వెస్ట్ చేసినా స్పందించిన సోను.. వారి సమస్యను సాల్వ్ చేసేందుకు చొరవ తీసుకున్నాడు. ఆయన సేవలను సెలబ్రిటీస్, రాజకీయ నాయకులతో పాటు దేశం మొత్తం కొనియాడింది. ఈ మేరకు ఆయన సేవలను గుర్తించిన డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ సంస్థ ‘స్పైస్ జెట్’ బోయింగ్ 737 విమానం మీద ‘ఏ సెల్యూట్ టు సేవియర్ సోనుసూద్’ అనే క్యాప్షన్‌తో ఆయన బొమ్మను వేసింది.

ఓ దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి. కాగా లాక్‌డౌన్ సమయంలో సోను, స్పైస్ జెట్ సంస్థ సంయుక్తంగా పూనుకుని 2.5 లక్షల మంది భారతీయులను స్వస్థలాలకు చేర్చిన సంగతి తెలిసిందే. స్పైస్ జెట్ సంస్థ తనకు ఇచ్చిన ఈ గౌరవం పట్ల సోను ఆనందం వ్యక్తం చేశాడు. స్పైస్ జెట్ చేసిన సేవలను గుర్తుచేసుకున్న హీరో.. ఇక మీదట కూడా ఇలాగే తన సేవా కార్యక్రమాలతో అందరినీ గర్వపడేలా చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నాడు.

Advertisement

Next Story