నూతన్ నాయుడు అరెస్ట్…

దిశ, వెబ్‌డెస్క్: దళిత యువకుడికి శిరోముండనం చేసిన కేసులో ఆరోపణలు ఎదర్కొంటున్న బిగ్‌బాస్-3 కంటెస్టెంట్ నూతన్‌ కుమార్‌ నాయుడును శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో నూతన్ నాయుడు ప్రమేయం ఉందని తెలిసిన తర్వాతనే అదుపులోకి తీసుకున్నామని విశాఖ సీపీ మనీశ్ కుమార్ సిన్హా తెలిపారు. ఈ ఘటన జరిగిన రోజే ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

కేసు నమోదు అయినప్పటి నుంచి పరారీలో ఉన్న నూతన్ నాయుడ్ని కర్ణాటకలోని ఉడిపిలో అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పట్టుకున్నామని సీపీ వెల్లడించారు. ఈ కేసులో నూతన్‌ కుమార్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్టు విశాఖ సిటీ పోలీసు కమిషనర్ తెలిపారు.

Advertisement