టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు మృతి

by Shyam |   ( Updated:2021-08-02 02:23:27.0  )
టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీ లో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్‌ దర్శకుడు,నటుడు ఇరుగు గిరిధర్‌(64) కన్నుమూశారు. ఆరేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన గిరిధర్ అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం తిరుపతిలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1982లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన గిరిధర్ సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఈవీవీ సత్యనారాయణ వంటివారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

ఇప్పటి స్టార్ హీరోల చిత్రాలైన ‘గుడుంబా శంకర్’, ‘అన్నవరం’, ‘వన్’, ‘సుప్రీమ్’, ‘వరుడు’ వంటి సినిమాలకు కోడైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఇక అప్పట్లో ‘శుభముహుర్తం’ చిత్రానికి దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్న గిరిధర్.. పలు చిత్రాల్లో నటుడిగా కూడా కనిపించారు. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘100 పర్సంట్ లవ్’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘శ్రీమంతుడు’ తదితర 20 సినిమాల్లో నటించారు. ‘100 పర్సంట్ లవ్’ చిత్రంలో తమన్నా తండ్రిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గిరిధర్‌ మృతి పట్ల టాలీవుడ్‌ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.

Fallow disha cinema facebook page: https://www.facebook.com/Dishacinema

Advertisement

Next Story