బై బై టోక్యో.. 2024 ఒలింపిక్స్ ఎక్కడంటే!

by Shyam |
tokyo
X

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్ ముగింపు వేడుకలు సాదాసీదాగా జరిగాయి. జులై 23న ఒలింపిక్ విలేజ్‌లో ప్రారంభమైన క్రీడలు ఆదివారంతో ముగిశాయి. కొవిడ్ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ -2020 జరుగుతాయా అన్న సందేహం అందరిలో నెలకొన్న విషయం తెలిసిందే. కానీ, జపాన్ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తల వలన ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన అథ్లెట్లకు ఎలాంటి నష్టం జరగకుండా క్రీడలను విజయవంతగా నిర్వహించి.. నేడు వీడ్కోలు సెలబ్రేషన్‌ను ఏర్పాటు చేసింది.

కరోనా నిబంధనల మేరకు జపాన్ జాతీయ స్టేడియంలో నిరాడంబరంగా వేడుకలు నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో విద్యుత్ కాంతుల నడుమ క్లోజింగ్ సెర్మోని జరిగింది. ఆ తర్వాత 2024లో పారిస్‌లో జరిగే ఒలింపిక్స్ గురించి 10 నిమిషాల పాటు ప్రొమోను విడుదల చేశారు. చివరగా ఒలింపిక్స్ టార్చ్‌ను ఫ్రాన్స్ దేశ నిర్వహకులకు అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed