‘శ్యామ్ సింగరాయ్’ నుంచి మరో‌ సాంగ్ రిలీజ్..

by Shyam |
‘శ్యామ్ సింగరాయ్’ నుంచి మరో‌ సాంగ్ రిలీజ్..
X

దిశ, సినిమా: రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని డబుల్ రోల్ పోషిస్తున్న మూవీ ‘శ్యామ్ సింగరాయ్’. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల కానున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్, ట్రైలర్, సాంగ్స్ అభిమానులను ఆకట్టుకోగా.. ఈ రోజు ఉదయం మరో పాటను మూవీ యూనిట్ విడుదల చేసింది. ‘తెరపైనా.. కదిలేలా.. కథలేవో మొదలయ్యే.. తారా’ అంటూ సాగే ఈ సాంగ్‌ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. ఇక ఈ గీతాన్ని క్రిష్ణ కాంత్ రచించగా కార్తీక్ ఆలపించారు. మిక్కీ జే మేయర్ సంగీతం. నిహారిక ఎంటర్ టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో వెంకట్ ఎస్ బోయిన్‌పల్లి నిర్మిస్తున్న ఈ మూవీలో నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Advertisement

Next Story