బుధవారం పంచాంగం, రాశిఫలాలు (02-06-2021)

by Hamsa |
బుధవారం పంచాంగం, రాశిఫలాలు (02-06-2021)
X

ప్రదేశము : హైదరాబాద్ , ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : బుధవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అష్టమి
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 51 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 16 ని॥ వరకు)
నక్షత్రం : శతభిష
(నిన్న సాయంత్రం 4 గం॥ 14 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 5 గం॥ 5 ని॥ వరకు)
యోగము : విష్కంభము
కరణం : బాలవ
వర్జ్యం : (నిన్న రాత్రి 11 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 20 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 11 గం॥ 54 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 36 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : ( ఉదయం 9 గం॥ 37 ని॥ నుంచి 11 గం॥ 16 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఉదయం 11 గం॥ 47 ని॥ నుంచి 12 గం॥ 39 ని॥ వరకు)
రాహుకాలం : (ఉదయం 12 గం॥ 13 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 51 ని॥ వరకు)
గుళికకాలం : ( ఉదయం 10 గం॥ 35 ని॥ నుంచి 12 గం॥ 13 ని॥ వరకు)
యమగండం : ( ఉదయం 7 గం॥ 18 ని॥ నుంచి 8 గం॥ 56 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 40 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 47 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : కుంభము

మేషరాశి : ఈ రోజు అన్ని గ్రహాలు మీకు అనుకూలం. ఎంతో కాలంగా నలుగుతున్న కోర్టు కేసు మీకు అనుకూలం. ఈ సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. మీ కుటుంబ సభ్యులలో పెళ్లి కాని వారికి సంబంధాలు వస్తాయి. డబ్బును ఆదా చేస్తారు. ఫిట్ నెస్ కోసం చేస్తున్న ప్రయత్నాల వలన శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆఫీసులో అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు తగినంత సమయం కేటాయించడం లేదని మానసిక అశాంతి.

మిధున రాశి : కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ కలలను సార్థకం చేసుకునే అవకాశం వచ్చింది. మీ సంతోషాన్ని తల్లిదండ్రులతో పంచుకోండి. శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఆర్థిక వ్యవహారాలు బాగున్నా కొన్ని అవసరాలకు సరిపోవు. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన పెట్టుబడులను వాయిదా వేయండి. విద్యార్థులు చదువులో మరికొంచెం శ్రమపడాలి. ఈ రాశి స్త్రీలకు మీ భర్తతో చిన్న తగవులు రావచ్చు జాగ్రత్తపడండి.

కర్కాటక రాశి : శుభకార్యాలలో పాల్గొంటారు. దీనితో పూర్తిగా రిలాక్స్ అవుతారు. ఆఫీసులో అన్ని పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ క్రింది ఉద్యోగుల ప్రశంసలు అందుకుంటారు. మీ అవసరాలకు సరిపడినంత డబ్బు చేతికందుతుంది డబ్బులు పొదుపు చేస్తారు. వ్యాపారస్తులకు తగిన లాభాలు చేతికి అందుతాయి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క హాస్యధోరణి ఆనందాన్నిస్తుంది.

వృషభ రాశి : సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనటం మీకు హాయినిస్తుంది. లాభాలను తెచ్చే పెట్టుబడులకు సరైన సమయము. కావలసినంత డబ్బు చేతికందుతుంది. ఆఫీసులో వర్క్ ను పూర్తి చేయడం కోసం సరైన ప్రణాళిక తప్పనిసరి. రాజకీయ నాయకులకు పదవులు లభించే అవకాశం. ఆఫీసులో అందరూ సహకరిస్తారు. అన్ని పనులలోనూ విజయం లభించే అవకాశం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలు మీ చిరునవ్వుతో అందరినీ జయిస్తారు.

కన్య రాశి : వర్క్ from హోమ్ వలన మీ ఫిట్ నెస్ ప్రోగ్రాం దెబ్బతింది. ఆఫీసులో మీరంటే పడని వర్గం మీ మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు. జాగ్రత్త వహించండి. ఆదాయం బాగున్నా అనవసరపు ఖర్చులను నివారించండి. కొంతమందికి అతి శ్రమ వలన తలనొప్పి వచ్చే అవకాశం. సమయానికి భోజనం చేయండి. పాత బకాయిలు తీర్చకుండా కొత్తగా అప్పు అడిగే బంధువులను దూరం పెట్టండి. మీ హుందా ప్రవర్తన సంఘంలో పేరుప్రతిష్టలు తెస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

సింహరాశి : ఈ రోజు అన్ని విధాలా అనుకూలం. మంచి భోజనం చేస్తారు. ఆఫీసు పనిలో మీరు చూపించిన విశ్వాసం ప్రత్యేక వ్యక్తిగా నిలబెడుతుంది. మీ పిల్లలతో కొంచెం సమయం గడపటం వలన వారు ఎంతో సంతోష పడతారు. కొంతమందికి ఎంతో కాలంగా వేధిస్తున్న అనారోగ్యం దూరం అవుతుంది ఈ రాశి స్త్రీలు దుబారా ఖర్చుల గురించి కుటుంబ సభ్యులకు లెక్చర్ ఇస్తారు.

తులారాశి : ఆదాయపరంగా అనుకూలమైన రోజు. కొత్తగా పెట్టుబడులు పెడతారు. కొన్ని విషయాలలో సహనంతో వ్యవహరించండి. పాత బకాయిలు వసూలవుతాయి. ఆఫీసులో పని విషయంలో సరైన ప్రణాళికతో పనులు పూర్తి చేయండి. కొంతమందికి కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం. ఫిట్ నెస్ కొరకు యోగా మెడిటేషన్ చేయండి. అవకాశాల కోసం ఎదురు చూడనక్కరలేదు అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

వృశ్చిక రాశి : శారీరకంగా మానసికంగా అలసట వలన విచారం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ కరోనా సమయంలో అనవసర భయాందోళనలవలన అందరి మీద నమ్మకం పోతుంది. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఈ నమ్మకం వలన ఉద్యోగం లో అందరి ప్రశంసలు లభిస్తాయి. కావలసినంత డబ్బు చేతికి అందుతుంది. పొదుపు చేస్తారు. బయట భోజనం తన ఇంటి భోజనమే బెస్ట్. ఈ రాశి స్త్రీలకు కుటుంబంలోని ఆహ్లాదకర వాతావరణం ఎంతో హాయినిస్తుంది.

ధనస్సు రాశి : చాలా సంతోషకరమైన రోజు. ఉద్యోగంలో కొందరికి మార్పులు. అనుకోని ప్రయాణాలు. అనుకున్న పనులు పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. అనవసరపు ఖర్చులను తగ్గించుకోండి. మద్యపానం ధూమపానం వదిలివేయడం మంచిది. ఆఫీసులో మీ పని సామర్థ్యము శత్రువులను కూడా మిత్రులను చేస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క హాస్యచతురత మరియు హుందా ప్రవర్తన ఎంతో సంతోషాన్నిస్తుంది.

మకర రాశి : మీ హాస్యచతురత అందరినీ మెప్పిస్తుంది. మీ ఆత్మీయుల నుంచి తగినంత సహకారం లభిస్తుంది. స్థిరాస్తి అమ్మకం విషయంలో మీరు ఊహించనంత లాభాలు. ఉద్యోగంలో ఏ పనులు పెండింగ్ లేకపోవటం వలన ఎంతో రిలీఫ్. ఫిట్ నెస్ కోసం చేసిన ప్రయత్నాల వలన మీ శరీరం యవ్వనంగా ప్రకాశిస్తుంది. ఈ రాశి స్త్రీలకు ఈరోజు మీ కొత్త పెళ్లి నాటి రోజులను గుర్తుకు తెస్తుంది.

కుంభరాశి : పనులు సకాలంలో పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. కొంతమందికి ఉద్యోగంలో అధిక శ్రమ ఉన్న పనులు సకాలంలో పూర్తవుతాయి. భూమి కొనుగోలుకు సంబంధించి పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. విద్యార్థులకు నిరుద్యోగులకు కొంచెం శ్రమ పడితే మీ గోల్ సాధిస్తారు. మీ తల్లి గారి వైపునుంచి ధన సహాయం అందుతుంది. విదేశాలలో ఉన్న మీ బంధువుల నుంచి బహుమతులు అందుతాయి. వ్యాపారస్తులకు లాభాలు సూచన. ఈ రాశి స్త్రీలకు మీ భర్త కుటుంబ సభ్యులను పట్టించుకోకపోవడం ఎంతో బాధిస్తోంది.

మీన రాశి : ఉద్యోగంలో మీ సామర్థ్యంపై అందరూ ప్రశంసలు కురిపిస్తారు. పై అధికారుల మెప్పు పొందుతారు. ఆదాయ వ్యవహారాలు చక్కబడతాయి. కుటుంబంలోని వ్యక్తుల అనవసరపు ఖర్చులను చాకచక్యంగా పరిష్కరిస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు బంధువులతో ఆత్మీయులతో అనవసర వాదోపవాదాలకు దిగవద్దు.

Advertisement

Next Story

Most Viewed