- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్నీళ్లతో మొదలెట్టి.. ప్రపంచాన్ని నవ్వించిన చార్లీ చాప్లిన్
దిశ, వెబ్‌డెస్క్: కామెడీ బ్రహ్మ.. నవ్వుల రారాజు.. స్మైల్‌కు చిరుణామా చార్లీ చాప్లిన్. ఎవరు ఎంత కష్టంలో ఉన్నా.. ఎన్ని బాధలు ఉన్నా.. చాప్లిన్ వీడియో క్లిప్ చూస్తే వాటన్నిటినీ ఇట్టే మర్చిపోతాం. ఆయన చేసే హాస్యంలో అంత మ్యాజిక్ ఉంటుంది మరి. చేతిలో కర్ర, చిరిగిన కోటు, తలపై టోపీతో తనకే ప్రత్యేకమైన నడక.. అల్లరి, అమాయక చేష్టలతో కడుపుబ్బ నవ్వించే చాప్లిన్ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ప్రపంచాన్ని తన హాస్యంతో నవ్వించిన చార్లీ చాప్లిన్ జీవితం మాత్రం ఆనందంగా సాగలేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించిన చాప్లిన్ ఆ స్థాయికి వెళ్లడానికి ఎంతో కష్టపడటంతో పాటు కటిక పేదరికాన్ని చవిచూశాడు. చాప్లిన్ 1889లో లండన్‌లో జన్మించారు. దాదాపు పదేండ్లు లాంబెత్ వర్క్ హౌస్‌లో నివసించారు. తర్వాత 1910లో అమెరికా వెళ్లారు. చార్లీచాప్లిన్ చిన్నతనంలో తినడానికి తిండి కూడా లేక ఎంతో ఇబ్బందిపడ్డారు. దీంతో తెలిసినవాళ్లు, బంధువుల ఇళ్ల వద్ద భోజనం చేసేవారు. ఆ సమయంలో బంధువులు ఆయన పట్ల చూపిన వివక్షే ఆయన్ను నేడు ఇంతటి వ్యక్తిని చేసింది.
ఎన్నో కష్టాల ఫలిలంగా ఆయన ‘మేకింగ్ ఏ లవ్’ అని సినిమాతో తన సినీ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచమే తన గురించి ప్రత్యేకంగా చర్చించుకునేలా చేశాడు. కేవలం నటుడే కాకుండా.. ఆయనలో అద్భుతమైన రచయిత, దర్శకుడు కూడా ఉన్నాడు. యావత్ ప్రపంచాన్నీ తన అభినయంతో ఆకట్టుకున్నాడు. నవ్వుల పువ్వులు పూయించి, హాస్యనట చక్రవర్తిగా జనం మదిలో ఈ నాటికీ నిలిచిపోయాడు. మూకీలతో మ్యాజిక్ చేసిన చాప్లిన్ తరువాత మాటలతోనూ ప్రేక్షకులను రంజింప చేశారు. ఆ నాటి డిక్టేటర్ అడాల్ఫ్ హిట్లర్ పై చాప్లిన్ రూపొందించిన వ్యంగ్య చిత్రం ‘ద గ్రేట్ డిక్టేటర్’ ఆయనకు మంచి పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. అంతేగాకుండా.. చార్లీ చాప్లిన్ జీవితంలో దేవుళ్లపై పెద్దగా ఆసక్తిచూపలేదు. కొన్నిసార్లు నాస్తికునిగా కనిపించేవారు. అందులో భాగంగానే ప్రపచంలో ‘జీసస్ కంటే తనకే ఎక్కువ పాపులారిటీ ఉంది’ చాటింపు సైతం వేయించుకున్నారు. ఆనంతరం అనేక విమర్శలకు గురై, 1977లో డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ రోజునే మరణించాడు. చాప్లిన్ కడదాకా తన నవ్వులతో చుట్టూ ఉన్నవారిని ఆనందింప చేశారు.