- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదకొండు పైసలు పెరిగిన రూపాయి..
ముంబై : ఏడాది చివరి రోజు… భారత ఆర్థిక రంగానికి ఊరట కలిగింది. సెన్సెక్స్ నిఫ్ట్ లాభాల్లో ట్రేడ కాగా. డాలర్ మారకంతో రూపాయి విలువ పెరిగింది. డిసెంబర్ 31న ఉదయం సెషన్లో డాలర్‌తో రూపాయి విలువ 16 పైసలు లాభపడి 73.15 వద్ద ట్రేడ్ అయింది. కిందటి సెషన్ లో 73.31 వద్ద ముగిసింది. నేడు ఓ సమయంలో 25 పైసలు బలపడి 73.06 వద్ద ట్రేడ్ అయింది. ఇది రెండు నెలల గరిష్టం. మొత్తంగా చూస్తే డాలర్ మారకంతో 11 పైసలు లాభఫడి 73.31 వద్ద ముగిసింది.
కారణమిదేనా..
అమెరికాలో కరోనా ప్రభావం, ఆర్థిక ప్యాకేజీ వంటి వివిధ కారణాల వల్ల సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ విలువ రెండేళ్ల కనిష్టానికి చేరుకుంది. రూపాయి బలపడటానికి ఇది ప్రధాన కారణం. అలాగే, దేశీయ ఈక్విటీ కూడా కారణం. ఏప్రిల్ 2018 తర్వాత సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ 0.074 శాతం మేర క్షీణించి 89.528 కి పడిపోయింది. అంతేకాకుండా, ఆసియా దేశాల కరెన్సీలు పుంజుకోవడం కూడా రూపాయికి కలిసొచ్చింది. ప్రధానంగా చైనా తయారీ రంగం జోరందుకోవడంతో డాలర్ మారకంతో యువాన్ 6.54 ను తాకింది. మరోవైపు… సెప్టెంబరు నాటికి కరెంట్ ఖాతా 15.5 బిలియన్ డాలర్ల మిగులుకు చేరిందంటూ ఆర్‌బీఐ వెల్లడించడం కూడా రూపాయికి కలిసొచ్చింది.