భారత్‌లో భారీగా కేసులు.. 24,309 మంది మృతి

by Anukaran |   ( Updated:2020-07-14 22:43:47.0  )
భారత్‌లో భారీగా కేసులు.. 24,309 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. చాలామంది మృతిచెందారు. నిన్న ఒక్కరోజే 29 వేల 429 కొత్త కేసులు నమోదయ్యాయి. 582 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 9 లక్షల 36, 181 సంఖ్యకు చేరుకుంది. ఇందులో 5 లక్షల 92,032 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 3 లక్షల 19,840 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 24,309 కు చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed